కామన్వెల్త్ గేమ్స్‌లో బుధవారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో బార్బడోస్‌ను ఓడించి గ్రూప్ Aలోని ఇండియా జట్టు సెమీఫైనల్ చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేయగా, ఇక ఛేదనకు దిగిన బార్బడోస్ 62 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రేణుకా సింగ్ 4, స్నేహ రాణా 1, రాధా యాదవ్ 1, మేఘనా సింగ్ 1, హర్మన్‌ప్రీత్ కౌర్ 1 వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.