సిరీస్ సమరానికి సమయం ఆసన్నమైంది. మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో టీ20లో ఓటమిని మర్చిపోయి ఈ మ్యాచ్ గెలవాలని భారత్ పట్టుదలతో ఉంది. ఎలాగైనా చివరి మ్యాచులో గెలిచి తొలిసారిగా సిరీస్ దక్కించుకోవాలని శ్రీలంక ఉవ్విల్లూరుతోంది. టీమిండియా జట్టులో ఎలాంటి మార్పుల్లేవు. శ్రీలంకలో భానుక రాజపక్స స్థానంలో ఫెర్నాండెజ్‌ని తీసుకున్నారు. **భారత్:** ఇషాన్ కిషన్, గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివం మావి, అర్షదీప్ సింగ్, చాహల్, ఉమ్రాన్ మాలిక్.