రేపు బంగ్లాదేశ్, ఇండియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పునరాగమనంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగా మారింది. బంగ్లాదేశ్ జట్టుకు లిటన్ దాస్ సారథ్యం వహించనున్నాడు. కీలక ప్లేయర్లైన టస్కిన్ అహ్మద్, తమిమ్ ఇక్బాల్ దూరం కావడంతో బంగ్లా కాస్త బలహీనపడింది. అయినా, మ్యాచ్‌ని తేలిగ్గా తీసుకోబోమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. బంగ్లా జట్టు ఎంతో మెరుగుపడిందని, గట్టి పోటీ ఇస్తామని తెలిపాడు. ఢాకా వేదికగా రేపు ఉదయం 11.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.