హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా మరోసారి రాణించింది. ఇంగ్లాండుతో జరిగిన మ్యాచుని రద్దు చేసుకుని పాయింట్ల పట్టికలో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల తరఫున ఒక్క గోల్ కూడా నమోదు కాకపోవడం విశేషం. దీంతో అంపైర్లు మ్యాచ్‌ని డ్రాగా ప్రకటించి.. చెరో పాయింట్‌ని కేటాయించారు. ఇండియా కన్నా ఇంగ్లాండ్‌కు గోల్స్ ఆధిక్యం ఎక్కువగా ఉండటంతో ‘పూల్-డి’లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. తొలి మ్యాచులో టీమిండియా స్పెయిన్‌పై 2-0 గోల్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. జనవరి 19న భారత్ వేల్స్‌ని ఢీకొనబోతోంది.