పూణే వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 207 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియాకు శ్రీలంక నిర్దేశించింది. శ్రీలంక బ్యాటర్లలో దాసున్ శనక చెలరేగి ఆడాడు. కేవలం 22 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కుశాల్ మెండీస్ 52, చరిత్ అసలంక 37, పాతుమ్ నిస్సాంక 33 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, అక్సర్ పటేల్ 2, చాహల్ ఒక వికెట్ పడగొట్టారు. శ్రీలంక స్కోరు: 206/6.