ఇండియా-ఐర్లాండ్ టీ20 సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 12ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్ల సమష్టి కృషితో అలవోకగా విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్…4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. హ్యారీ టెక్టార్ 64(33) జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఆ తర్వాత ఛేదనలో దీపక్ హుడా 47(29), ఇషాన్ కిషన్26 (11), హార్దిక్ పాండ్యా 24(12) చెలరేగడంతో 9.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తిచేశారు. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ (3-1-16-1), చాహల్ (3-0-11-1) ప్రత్యర్థిని కట్టడి చేశారు. రెండో టీ20 మంగళవారం జరగనుంది.