దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. కానీ తర్వాత ఆటకు దిగిన సౌతాఫ్రికా ఆటగాళ్లను 87 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో సిరీస్ 2-2తో సమం అయింది. అవేశ్ ఖాన్ 4 వికెట్లు, చాహల్ 2 వికెట్లు, హర్షల్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టి ఆకట్టుకున్నారు. ఇక చివరి 5వ మ్యాచ్ ఆదివారం(జూన్ 19న) బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.