ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిందని అనౌన్స్ చేసిన క్షణంలో ఆనందం తట్టుకోలేక పోయా. ఆస్కార్ వేదిక మీద RRR టీమ్ చేతికి ఆస్కార్ అందించినప్పుడు అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదనిపించింది. రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అవార్డు వచ్చిన విషయం నా ఫ్యామిలీలో మొదటగా నా వైఫ్‌కి చెప్పా. మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన అభిమానులకి, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు’ చెబుతున్నట్లు తెలిపారు.