నేటితో (మంగళవారం) తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 7వ తేదీన మొదలైన సమావేశాలు మొత్తం ఏడు రోజులు సాగాయి. శాసనసభ మొత్తం 54 గంటల 55 నిమిషాల పాటు, శాసనమండలి 12 గంటల పాటు సాగింది. దీంతో శాసనసభ సగటున 8 నుంచి 12 గంటల జరిగినట్లు తెలుస్తోంది. ఆఖరి రోజు సీఎం కేసీఆర్ సభలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. సభ అర్దవంతంగా సాగిందన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ప్రతిపక్ష నాయకులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ కంటే ప్రతిపక్ష నాయకులే ఎక్కువ సేపు మాట్లాడారని పేర్కొన్నారు. కాగా, సభ ప్రారంభమయిన మొదటి రోజే బీజేపీ ముగ్గరు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు.