తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్ నుంచి చదువును మధ్యలోనే ఆపేసి వచ్చిన మెడికల్ స్టూడెంట్లకు సాయం చేస్తామని ప్రకటించారు. ఎంత ఖర్చయినా వారి డాక్టర్ కోర్సు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే చదివిస్తుందని స్పష్టం చేశారు. మెప్మా, ఐకేపీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని తెలిపారు.