తెలంగాణలో నిన్న రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగించారు. నిన్న ఒక్కరోజే 14,160 మెగా వాట్ల విద్యుత్‌ను ఉపయోగించినట్లు విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 18,000 మెగావాట్ల వరకు ఎటువంటి ఢోకా లేదని భరోసానిచ్చింది. బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ. 20 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలియజేశారు. పెరుగుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు విద్యుత్ పరికరాలను ఎక్కువగా వాడుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో వినియోగం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.