తెలంగాణ వంటకాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణలో వంటకాలు ఘాటుగా ఉంటాయని… తాను అంత కారం తినలేనని అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో పర్యటిస్తున్న ఆయన ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆహారపు అలవాట్ల గురించి ప్రస్తావించగా..” నేను భోజన ప్రియుడిని కాదు. తినే సమయానికి ఏది ఉంటే అది తినేస్తాను. బఠాణీ, పనసపండు నచ్చదు. నేను నాన్వెజిటేరియన్. చికెన్, మటన్, సీఫుడ్ లాగించేస్తాను” అన్నారు.