సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ రాష్ట్రవ్యాపంగా 91,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటి వివరాలను శాఖల వారీగా ప్రకటించారు. వీటిలో 80,039 పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నారు. మిగతా 11,103 పోస్టులకు ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నారు.
**శాఖల వారీగా ఖాళీలు**
– పోలీస్ శాఖ- 18,334
– ఉన్నత విద్యా శాఖ- 7,878
– విద్యాశాఖ- 13,086
– వైద్య శాఖ- 12,755
– రెవెన్యూ శాఖ- 3,560
– బీసీ సంక్షేమ శాఖ- 4,311
– ఎస్సీ సంక్షేమ శాఖ- 2,879
– సాగునీటి శాఖ- 2,692
– పశుపోషణ, మత్స్యశాఖ- 353
– యూత్,టూరిజం, కల్చర్- 184
– ప్లానింగ్-136
– లెజిస్లేచర్- 25
– ఫుడ్, సివిల్ సప్లయ్- 106
– ఎనర్జీ- 16