దర్శకధీరుడు రాజమౌలి తెరకెక్కించిన భారీ మల్టీ స్టారర్ మూవీ RRR మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచింది. ఇక తెలంగాణ ప్రభుత్వమైతే మరో అడుగు ముందుకేసి మొదటి 10 రోజులు తెలంగాణలో 5 షోలు వేసుకోవచ్చునని ప్రకటించింది. మార్చి 25 నుంచి 27 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు రూ. 30 పెంచుకునేలా అనుమతినిచ్చింది. ఇక మల్టీప్లెక్స్‌ల విషయానికి వస్తే మార్చి 25 నుంచి 27 వరకు రూ. 100, మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు రూ. 50 పెంచుకునేలా అనుమతినిచ్చింది.