హైదరాబాద్ మహానగరానికి తాగు నీటి అవసరాలు తీరుస్తున్న జంటజలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిసర గ్రామాల్లో ఎటువంటి భారీ కట్టడాలు నిర్మించకుండా నాటి ప్రభుత్వాలు 111 జీవోను ప్రవేశపెట్టాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ఈ జంట జలాశయాల తాగు నీరు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి త్వరలోనే ఈ జీవోను రద్దు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో కొన్ని ప్రభుత్వాలు ఈ జీవో విషయంలో కలగజేసుకుంటే సుప్రీం కోర్టు సీరియస్ అయింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో.