తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రసంగం లేకుండా సోమవారం నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. తన ప్రాథమిక ఉద్దేశం ప్రజల సంక్షేమమే కాబట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు తన సిఫార్సును అందజేస్తానన్నారు. ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెప్పిన ప్రభుత్వం, తర్వాత ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మరోవైపు తెలంగాణ బడ్జెట్ 2022-23కు రాష్ట్ర కేబినెట్ ఆదివారం ఆమోదం తెలిపింది. అయితే ఈసారి బడ్జెట్ 2 లక్షల 50 వేల కోట్లకుపైగా ఉంటుందని సమాచారం