తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాల నుంచి బీజేపీకి చెందిన, ముగ్గురు MLAలైన రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్లను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు దీనిపై న్యాయపోరాటానికి దిగారు. వారు తెలంగాణ హై కోర్టులో ఇందుకు సంబంధించి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును నేడు వెల్లడించనున్నట్లు జస్టిస్ షహీమ్ అక్తర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన నోటీసులను పంపినపుడు తీసుకోకుండా తప్పించుకున్న శాసనసభ కార్యదర్శి వ్యవహారం తమల్ని ఆశ్చర్యానికి గురి చేసిందని జడ్జి అన్నారు. నేడు మధ్యాహ్నం ఈ తీర్పు వెలువడనుంది.