తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటికే ఫలితాల ప్రకటనకు అన్ని ఏర్పాట్లు చేసిన ఇంటర్మీడియట్ బోర్డు.. ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తుంది. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఆమోదం ఇవ్వొచ్చని సమాచారం. దీంతో ఈ నెల 27న పరీక్షా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన పరీక్షల్లో ఈసారి 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లుగా తెలుస్తుంది.