తెలంగాణలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని టీపీసీసీ చింతన్ శిబిర్ రాజకీయ కమిటీ ధీమా వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా తాము 60 స్థానాలకు పైగా సీట్లు సాధించే అవకాశముందని తేలినట్లు పేర్కొంది. బుధవారం కీసరలోని బాలవికాస్ ప్రాంగణంలో ‘నవ సంకల్ప్ శిబిర్’లో దీనిపై చర్చలు జరిగాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు అవసరం లేదని సొంతంగానే గెలిచే అవకాశముందని వెల్లడించింది. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలపై చర్చించింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత ఏర్పడిందని, బీజేపీ కూడా అంత ప్రభావవంతంగా ఏమీలేదని తేల్చింది. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌నే ప్రత్యామ్నాయంగా అనుకుంటున్నారని అభిప్రాయపడింది.