తెలంగాణ హైకోర్టుకు ఇటీవల కొత్తగా నియామకం అయిన 10 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం ఆమోదం తెలిపారు. ఈ పది మందితో కలిపి హై కోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. మరో 13 పోస్టులు ఖాళీగా ఉంటాయి.