ఇవి పాటిస్తే పోలీస్ ఉద్యోగం ఖాయం!

© Envato

తెలంగాణలో త్వరలో పెద్ద ఎత్తున పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దాదాపు 16 వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ క్రమంలో తక్కువ సమయంలో ఏ విధంగా ప్రిపేర్ అయితే కొలువు సాధించవచ్చో ఇప్పుడు చుద్దాం. మొదట 6 నుంచి 10వ తరగతి వరకు స్కూల్ బుక్స్, ఇంటర్ తెలుగు అకాడమీ పుస్తకాలు, ఎన్సీఈఆర్టీ, న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ చదవాలి. వీటితోపాటు మ్యాథ్స్, రిజనీంగ్ సిలబస్ కు అనుగుణంగా కూడా ప్రాక్టీస్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు రోజూ ఫిజకల్ టెస్టు కోసం ఓ గంట ప్రాక్టీస్ చేయాలని అంటున్నారు. ఇవి ప్రణాళిక ప్రకారం పాటిస్తూ చదివితే ఉద్యోగం సులభంగా సొంతం చేసుకోవచ్చు. ఇక పోలీస్ పరీక్షలో మొదట ప్రిలిమ్స్, తర్వాత ఫిజికల్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది.

Exit mobile version