తెలంగాణలో వీఆర్వో వ్యవస్థకు ప్రభుత్వం గుడ్ బాయ్ చెప్పింది. ఈ ఉద్యోగులను ఇతర విభాగాల్లో సర్దుబాటు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. లాటరీ విధానంలో పలు విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ సమాన హోదాల్లో సర్దుబాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ వ్యవస్థను రద్దు చేస్తు(జీవో నెం.121) సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జోవో 121ని 15 రోజుల్లో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.