భారాస నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీతో పాటు అధికారిక కార్యక్రమాలకు తనను పిలవడం లేదన్నారు. “నాతో గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పండి. సమస్యకు పార్టీ నాయకులేే బాధ్యత వహించాలి. పిలిస్తే ఎక్కిడికైనా వస్తాను. అందరూ కలిసి పనిచేయాలి” అన్నారు. గత కొన్ని రోజులుగా ఖమ్మంలో భారాస నేతల మధ్య విబేేధాలు గులాబీ బాస్‌ను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే.