తెలుగుదేశం పార్టీ మీడియా ఇంఛార్జీ దారపనేని నరేంద్రను CID అరెస్ట్ చేసింది. గుంటూరులో బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఏడుగురు సీఐడీ అధికారులు దాదాపు 2గంటల పాటు నరేంద్రను ప్రశ్నించారు. గతంలో గన్నవరం విమానాశ్రయంలో బంగారం తరలింపు వ్యవహారంపై సీనియర్ జర్నలిస్టు అంకబాబు షేర్ చేసిన పోస్టు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇదే పోస్టును నరేంద్రకూడా షేర్ చేశారని, అదే కేసులో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.