ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం వ్యాఖ్యత జిమ్మీ కిమ్మెల్‌పై తెలుగు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. RRR చిత్రాన్ని బాలీవుడ్ మూవీగా పేర్కొనడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. రాజమౌళి అనేక ఇంటర్వ్యూల్లో RRR మూవీ తెలుగు చిత్రంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న తెలుగు సినిమాను బాలీవుడ్ చిత్రంగా చెప్పటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిమ్మీ RRR గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడాల్సి ఉంటే బాగుండేదని విమర్శిస్తున్నారు.