తెలంగాణలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రమంలో తెలుగు సినీ, టాలీవుడ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలుగు చిత్రసీమలో తెలంగాణ యాసను విరివిగా వాడుతున్నారని గుర్తు చేశారు. దాని వల్లే హీరోలకు హిట్లు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదన్నారు. తెలుగు సినిమాల్లో తెలంగాణ భాషను కించపరిచారని, ఆ భాష వాడిన వారిని జోకర్లుగా చిత్రాల్లో చూపించారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భాషను పరిరక్షించుకుని గుర్తింపు తెచ్చుకున్నామని వెల్లడించారు.