తెలుగు ఇండియన్ ఐడల్ రెండో భాగం రాబోతుంది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 29న మెగా ఆడిషన్స్ జరగబోతున్నాయి. బషీర్‌బాగ్‌లోని సెయింట్ జార్చ్ గర్ల్స్ గ్రామర్ స్కూల్‌లో చేపడుతున్నారు. 16 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు హాజరు కావచ్చు. తమలో టాలెంట్‌ను నిరూపించుకోవాలనుకునే వారికి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ కార్యక్రమానికి తమన్, నిత్యా మీనన్, సింగర్ కార్తీక్ జడ్జీలు.