తెలుగురాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల పవనాలు మరో మూడు రోజుల వరకు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ- ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూరులో 4.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగాను 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. రాత్రి 7గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలిగాలులు గజగజ వణికిస్తున్నాయి. అటు ఏపీలోని లంబసింగిలో 1.5డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలిగాలుల తీవ్రతకు చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు చలిగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.