ఫోర్బ్స్ ఇండియా బెస్ట్ డిజిటల్ క్రియేటర్ జాబితాలో తెలుగు యూట్యూబర్ సయ్యద్ హాఫిజ్ చోటు సంపాదించాడు. ‘తెలుగు టెక్ ట్యూట్స్’ పేరుతో ఛానెల్ నడుపుతున్న ఈయన.. ఫోర్బ్స్ ప్రకటించిన దేశంలోని బెస్ట్ డిజిటల్ క్రియేటర్స్‌లో 32వ స్థానంలో నిలిచాడు. ఇతనికి యూట్యూబ్‌లో 16 లక్షల మంది సబ్స్‌క్రైబర్లు ఉన్నారు. ఈయన టెక్నాలజీ, మొబైల్ ఫోన్స్, టెక్ న్యూస్, టెక్ టిప్స్‌కు సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాడు.