దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుల్లో కూరుకుపోయినట్లు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన 78వ జాతీయ నమూనా సర్వేలో వెల్లడించింది. 18 ఏళ్ల పైబడిన వారిలో ప్రతి లక్షమందిలో 46,330 మంది సంస్థాగతంగానో, వ్యక్తుల ద్వారానో అప్పు తీసుకున్నట్లు తెలిపింది. ఈ జాబితాలో ఏపీ తర్వాత తెలంగాణ రెండోస్థానంలో ఉంది. తెలంగాణలో ప్రతి లక్ష మందిలో 39,358 మంది ఏదోక రూపంలో అప్పు చేశారు. దేశ సగటుతో పోలిస్తే ఏపీలో 193%, తెలంగాణలో 148% మంది అధికంగా అప్పుల్లో ఉన్నారు.