దిల్లీలో మళ్లీ చలి తీవ్రత పెరుగనుంది. వచ్చేవారం ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల కంటే దిగువకు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 16 నుంచి 18 మధ్యలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు వెల్లడించారు. గత కొన్ని వారాలుగా అక్కడ ప్రజల్ని చలి వణికిస్తోంది. నిన్న 10 డిగ్రీలు నమోదయ్యింది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బయట ప్రయాణాలు మానుకుంటే మంచిదని వెల్లడించారు. సీ విటమిన్ కలిగిన ఆహాారాన్ని తీసుకోవాలి.