తెలంగాణలో చలి పంజా విసురుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.ఆదిలాబాద్ జిల్లాలో 8.8 డిగ్రీలు, కొమురం భీం జిల్లాలో 9.1 డిగ్రీలు. మంచిర్యాల జిల్లాలో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రత, నిర్మల్ జిల్లాలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరబాద్‌లోనూ రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. ఉదయం 9 దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.