మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆలయాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ శివాలయాలను ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మరికొన్ని చోట్ల ఆలయాల్లో అర్ధరాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, శివ తత్వం ఉన్న సినిమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు మార్కెట్లలో కూడా పూజా సామాగ్రి, పండ్లు కొనుగోలు చేస్తూ భక్తుల సందడి వాతావరణం కనిపించింది.