హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం చేశాడంటూ వస్తున్న ఆరోపణలతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు నిరసన తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని…. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ రవిరంజన్ తనపై అత్యాచారం చేశాడని థాయిలాండ్ విద్యార్థిని గచ్చిబౌలి పోీలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.