హైదరాబాద్- నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రైవేట్ కాలేజీల ఆగడాలను ప్రభుత్వం అడ్డుకోవాలని నిరసిస్తూ ఏబీవీపీ విద్యార్థి సంస్థ ధర్నా నిర్వహించింది. కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల వద్ద నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి నేతలు ఆరోపించారు. భారీగా ర్యాలీగా వెళ్లిన ఏబీవీపీ నేతలు ఇంటర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏబీవీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.