ప్రధాని మోదీ చెన్నై పర్యటనలో హైడ్రామా చోటుచేసుకుంది. తమిళనాడులో 11 అభివృద్ధి కార్యక్రమాలను మోదీ గురువారం ప్రారంభించారు. అంతకుముందు ర్యాలీకి వేదికైన నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద డీఎంకే మద్దతుదారులు, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ కార్యకర్తలు ‘ప్రధాని మోదీ జిందాబాద్’ అనగా, డీఎంకే కార్యకర్తలు ‘కమాండర్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలోని హైదరాబాద్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ చెన్నై చేరుకున్నారు.