టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు- కుప్పం పర్యటనపై ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు కుప్పం వచ్చేందుకు టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు తీసివేశారు. కుప్పం నుంచి శాంతిపురానికి ప్రచార రథంపై చంద్రబాబు రోడ్ షో నిర్వహించాల్సి ఉంది. ఈ రోడ్ షోకు అనుమతి లేదన్న పోలీసులు.. ప్రచార రథాన్ని స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహానికి లోనైన టీడీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఇటీవల చంద్రబాబు రోడ్ షో దుర్ఘటనల వల్ల ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు.