• TFIDB EN
  • Editorial List
    మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
    Dislike
    2k+ views
    9 months ago

    మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఖైదీ(అక్టోబర్ 28 , 1983)
    A|157 minutes|యాక్షన్
    ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు.

    రీమేక్ - ‘ఫస్ట్ బ్లడ్’

    2 . చట్టానికి కళ్ళు లేవు(అక్టోబర్ 30 , 1981)
    A|141 minutes|యాక్షన్,థ్రిల్లర్
    చట్టానికి కళ్ళు లేవు అనేది S. A. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన 1981 భారతీయ తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి, మాధవి, లక్ష్మి, హేమ సుందర్, కన్నడ ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది 1981లో విడుదలైన తమిళ చిత్రం సత్తమ్ ఒరు ఇరుత్తరైకి రీమేక్. ఈ చిత్రం 30 అక్టోబర్ 1981న విడుదలై కమర్షియల్‌గా విజయం సాధించింది.

    రీమేక్ - 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్'

    3 . మనవూరి పాండవులు(నవంబర్ 09 , 1978)
    UA|డ్రామా
    గ్రామ పెద్ద ఊరిలోని ప్రజలను పీడిస్తూ వారిని బాధపెడుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఐదుగురు యువకులు ఊరి పెద్దను ఎదిరిస్తారు.

    రీమేక్ - పాడువారళ్లి పాండవరు

    4 . ఇది కథ కాదు(జూన్ 27 , 1979)
    U|డ్రామా
    భర్తతో విడాకుల తర్వాత సుహాసిని ఒంటరిగా జీవిస్తుంటుంది. అయితే ఇద్దరు వ్యక్తులు ఆమెను ప్రేమిస్తారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు సుహాసినికి సమస్యలు ఎదురవుతాయి.

    రీమేక్ - అవర్‌గళ్

    5 . పున్నమి నాగు(జూన్ 13 , 1980)
    U|డ్రామా,రొమాన్స్
    నాగులు (చిరంజీవి) పాములను అడించుకునే వ్యక్తి. అతడి తండ్రి చిన్నప్పటి నుంచి పాము విషాన్ని కొంచెం కొంచెంగా ఆహారంలో కలిపి ఇవ్వడంతో అతడి శరీరం విషపూరితంగా మారుతుంది. నాగులు ప్రేమించిన పూర్ణిమ(మేనక) ఓ రోజు అనుమానస్పదంగా చనిపోతుంది. అలాగే ప్రతీ పౌర్ణమికి ఓ స్త్రీ ఆ ఊరిలో చనిపోతుంటుంది. అయితే ఆ మరణాలకు కారణం ఎవరు? చివరికీ నాగులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అనేది అసలు కథ.

    రీమేక్ - హున్నిమేయ రాత్రియల్లి

    6 . ప్రేమ తరంగాలు(అక్టోబర్ 24 , 1980)
    U|యాక్షన్,డ్రామా
    అవినీతిపరుడైన ధర్మరాజు తన కూతురు లవర్ రామును కలిసినప్పుడు షాక్‌ అవుతాడు. అతను ఒకప్పుడు తనతో జైలులో ఉన్న పాపారాయుడిని పోలి ఉన్నట్లు గుర్తిస్తాడు.

    రీమేక్ - 'ముఖద్దర్ కా సికందర్'

    7 . మోసగాడు(మే 22 , 1980)
    U|యాక్షన్,డ్రామా
    పెళ్లి రోజున జగన్ కాబోయే భార్యపై ఓ రౌడీషీటర్ అత్యాచారానికి పాల్పడుతాడు. ఆ అవమానం తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుంది. దీంతో ఆ రౌడీ షీటర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు జగన్ బయల్దేరుతాడు.

    రీమేక్ - 'ఖాన్ దోస్త్'

    8 . మొగుడు కావాలి(అక్టోబర్ 15 , 1980)
    U|హాస్యం,డ్రామా
    క్రిష్ణకు పెళ్లంటే ఇష్టం లేదు. అయితే తన తండ్రి ఆస్తి పొందాలంటే ఆమె పెళ్ళి చేసుకోవాలని కండీషన్ ఉంటుంది. దీంతో ఒక వ్యక్తితో అగ్రిమెంట్ ద్వారా నకిలీ వివాహం చేసుకుంటుంది.

    రీమేక్ - 'మంచలి'

    9 . 47 రోజులు(జూలై 17 , 1981)
    A|డ్రామా
    నటి సరిత వైశాలితో మాట్లాడటానికి ఒక చిన్న పట్టణానికి వస్తుంది, ఎందుకంటే ఆమె తన జీవితం ఆధారంగా ఒక చిత్రంలో ఆమెతో నటించబోతోంది. వైశాలి హిస్టీరియాతో బాధపడుతూ, కోపంతో సరితను బయటకు పంపింది. ఈ కథ ఇప్పుడు ఫ్లాష్‌బ్యాక్ రూపంలో చెప్పబడింది, వైశాలి సోదరుడు సరితకు కుమార్‌తో తన వివాహం గురించి చెప్పినప్పుడు, అది కేవలం 47 రోజులు మాత్రమే.

    రీమేక్ - 47 నాట్కల్

    10 . పట్నం వచ్చిన పతివ్రతలు(అక్టోబర్ 01 , 1982)
    U|యాక్షన్,డ్రామా
    ఇద్దరు పెళ్లైన మహిళలు పట్టణంలో జీవించాలని కలలు కంటారు. కానీ పట్టణంలో జీవించడం వారి భర్తలకు ఇష్టం ఉండదు. దీంతో వారి భర్తలకు తెలియకుండా పట్టణానికి పారిపోతారు.

    రీమేక్ - 'పట్ణణక్కే బంధ పత్‌నియారు'

    11 . యముడికి మొగుడు(ఏప్రిల్ 29 , 1988)
    U|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
    కాళి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి కాళిని చంపిస్తాడు. దీంతో అతను యమలోకానికి వెళ్తాడు. అక్కడ యముడితో గొడవపడి తిరిగి మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి తన హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాడు.
    12 . మంచుపల్లకీ(నవంబర్ 19 , 1982)
    U|132 minutes|డ్రామా
    ఒక కాలనీలో నివసిస్తున్న నిరుద్యోగ యువకులు వారి పక్కింట్లో ఉంటున్న గీతను చూసి ఇష్టపడుతారు. అయితే వారి మాయలో పడని గీత వారికి గుణపాఠం నేర్పుతుంది. వారి బాధ్యతలను గ్రహించేలా చేస్తుంది.

    రీమేక్ -పాలైవోనా సోలై

    13 . బంధాలు అనుబంధాలు(నవంబర్ 26 , 1982)
    U|డ్రామా
    ఒక ఇన్‌స్పెక్టర్ జ్ఞాపకశక్తి కోల్పోయిన రోగిని మానసిక వైద్యుని వద్దకు తీసుకువస్తాడు. అయితే రోగి చనిపోతాడు. అతని హత్య కేసులో మానసిక వైద్యుడి భార్య, కాంపౌండర్‌ను నిందితులుగా ఇన్‌స్టెక్టర్ అనుమానిస్తాడు.

    రీమేక్ -‘అవళ హెజ్జే’

    14 . ప్రేమ పిచ్చోలు(జనవరి 14 , 1983)
    U|డ్రామా,రొమాన్స్
    రవి, ప్రేమ ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటారు. అయితే మరో ముగ్గురు వ్యక్తులు ఆమెను ప్రేమించడానికి ప్రయత్నించినప్పుడు విషయాలు తలకిందులు అవుతాయి.

    రీమేక్ - ‘షౌకిన్’

    15 . అభిలాష(మార్చి 11 , 1983)
    A|145 minutes|హారర్,థ్రిల్లర్
    మరణశిక్షను రద్దు చేయాలనే ఆలోచనతో ఒక న్యాయవాది ఓ హత్య కేసులో కావాలని అరెస్ట్ అవుతాడు. అయితే ఆ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే క్రమంలో పెద్ద సమస్యను ఎదుర్కొంటాడు.

    రీమేక్ -ది మ్యాన్ హు డేర్‌డ్

    16 . హీరో(మార్చి 23 , 1984)
    UA|129 minutes|యాక్షన్,అడ్వెంచర్
    గుప్త నిధులు వెలికితీసే పురావస్తు శాస్త్రవేత్త... కృష్ణ. ఓ గ్రామంలో గుప్త నిధులు వెలికితీసేందుకు వెళ్తాడు. కానీ అదే గ్రామంలో అతని స్నేహితుడు విక్రమ్ హత్యకు గురవుతాడు.తన స్నేహితుడి మరణం వెనుక ఉన్నది ఎవరు? గుప్త నిధులను కృష్ణ కనిపెట్టాడా? లేదా? అనేది మిగతా కథ.

    రీమేక్ -‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’

    17 . దేవాంతకుడు(ఏప్రిల్ 12 , 1984)
    U|యాక్షన్,డ్రామా
    విజయ్‌కి సవాళ్లను స్వీకరించే అలవాటు ఉంది. అతని స్నేహితుడు చంటి ఒక ప్రొఫెసర్‌ని చంపమని సవాలు విసురుతాడు. అయితే నిజంగానే ఆ ప్రొఫెసర్‌ హత్యకు గురవుతాడు. ఆ నింద విజయ్‌పై పడుతుంది.

    రీమేక్ - ‘గెలుపు నన్నదే’

    18 . ఇంటిగుట్టు(సెప్టెంబర్ 14 , 1984)
    U|యాక్షన్,డ్రామా
    చక్రపాణి తన భార్య సోదరిని వివాహం చేసుకోవాలని కుట్ర పన్నుతాడు. ఇందుకోసం భార్యను, కూతురిని చంపాలని పథకం వేస్తాడు. దీని గురించి తెలుసుకున్న చక్రపాణి భార్య, కూతురు అతడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటారు.

    రీమేక్ - ‘పనక్కర కుటుంబం’

    19 . నాగు(అక్టోబర్ 11 , 1984)
    U|యాక్షన్,డ్రామా
    నాగు అనే చిన్న క్రిమినల్‌.. తన ప్రియురాలి హత్య కేసులో ఇరుక్కుంటాడు. జగపతిరావు ఈ నేరానికి పాల్పడినట్లు నాగు అతని తల్లి తెలుసుకుంటారు. జగపతిరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడం మెుదలుపెడతాడు.

    రీమేక్ - ‘తీస్రి మంజిల్’

    20 . చిరంజీవి(undefined 00 , 1985)
    A|క్రైమ్,డ్రామా
    చిరంజీవి ఒక టాలీవుడ్ చిత్రం, ఇది 18 ఏప్రిల్ 1985న విడుదలైంది. ఈ చిత్రానికి CV రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవి, భానుప్రియతో విజయశాంతి ఒక చిన్న పాత్రలో నటించారు. ఈ చిత్రం కన్నడ చిత్రం నానే రాజా (1984)కి రీమేక్.

    రీమేక్ - ‘నానే రాజ’


    @2021 KTree