• TFIDB EN
  • Editorial List
    'నా సామిరంగ' చిత్రం మాదిరి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన నాగార్జున ఊరమాస్ సినిమాల గురించి తెలుసా?
    Dislike
    700+ views
    1 year ago

    నాసామిరంగ చిత్రంతో మరోసారి కింగ్ నాగార్జున సంక్రాంతి బరి(జనవరి 14)లో దిగనున్నారు. తనకు అచ్చొచ్చిన విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ కథాంశంతోనే ఆయన పోటీపడనున్నారు. గతంలో సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధించిన నాగార్జున మరోసారి అలాంటే గ్రామీణ నేపథ్యం ఉన్న స్టోరీతో తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పస్ట్ సింగిల్ సినిమాపై హైప్ పెంచాయి. గతేడాది రిలీజ్‌ అయిన ఘోస్ట్‌ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీంతో ఆయన మరోసారి విలేజ్ కథాంశాన్నే ఎంచుకున్నారు. కాగా నాగార్జున కెరీర్‌లో గ్రామీణ నేపథ్యంలో వచ్చి హిట్ కొట్టిన చిత్రాలేంటో ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . అల్లరి అల్లుడు(అక్టోబర్ 06 , 1993)
    U|158 minutes|డ్రామా
    కాలేజీ స్టూడెంట్ అయిన కళ్యాణ్‌ను శ్రావణి ప్రేమిస్తున్నట్లు చెప్పి అందరి ముందు అవమానిస్తుంది. దీంతో శ్రావణికి గుణపాఠం చెప్పేందుకు మారువేషంలో ఆమె ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆమె తల్లి అఖిలండేశ్వరి ఆస్తి తాలుకు సమస్యల నుంచి కాపాడుతాడు.
    2 . బంగార్రాజు(జనవరి 14 , 2022)
    UA|160 minutes|హాస్యం,ఫాంటసీ
    మనవడి కళ్యాణంతో పాటు, లోక కళ్యాణం కోసం బంగార్రాజు (నాగార్జున)ని కిందికి పంపిస్తాడు యమధర్మరాజు. మరి చిన్న బంగార్రాజు (నాగ చైతన్య), నాగలక్ష్మీ (కృతిశెట్టి)ని ఎలా కలిపాడు? ఊరి గుడిలో ఉన్న నిధులను ఎలా కాపాడాడు? అన్నది కథ.
    3 . మనం(మే 23 , 2014)
    UA|163 minutes|డ్రామా,ఫ్యామిలీ
    పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ.
    4 . రగడ(డిసెంబర్ 24 , 2010)
    A|146 min|యాక్షన్
    డబ్బులు సంపాదించాలన్న ఆశతో సత్య హైదరాబాద్‌కు వచ్చి గ్యాంగ్‌స్టర్ జికె వద్ద పనిచేయడం ప్రారంభించాడు. అయితే, అతని చర్యల వల్ల మరో గ్యాంగ్‌స్టర్ పెద్దన్నకు టార్గెట్ అవుతాడు. మరి సత్య ఆ గ్యాంగ్‌స్టర్‌ను ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథ.
    5 . ఎదురులేని మనిషి(మార్చి 30 , 2001)
    A|143 mins|హాస్యం,డ్రామా
    సూర్య ఊరికి పెద్ద. అతని భార్య చనిపోతుంది. అతనికి మరో పెళ్లి చేయాలని అతని సోదరుడు సూర్య, వధువుగా వసుంధరను సెలక్ట్ చేస్తాడు. అయితే వారిద్దరి వివాహం జరిగాక.. వసుంధర అసలు నైజాన్ని సత్య తెలుసుకుంటాడు.
    6 . సోగ్గాడే చిన్ని నాయనా(జనవరి 15 , 2016)
    UA|145 minutes|హాస్యం,డ్రామా
    బంగార్రాజు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. కొడుకు కాపురం గురించి ఆందోళన చెందుతున్న భార్య కోసం తిరిగి భూమి పైకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భూమిపైకి వచ్చిన బంగర్రాజు ఆత్మ ఏం చేసింది? అన్నది కథ.
    7 . ఘరానా బుల్లోడు(ఏప్రిల్ 27 , 1995)
    U|146 minutes|డ్రామా,రొమాన్స్
    రాజా అణగారిన వర్గాల కోసం పోరాడే డ్రైవర్‌. అమ్మాజీ చేస్తున్న దౌర్జన్యాలను అంతం చేయడానికి మనవడిగా ఆమె ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత రాజా ఏం చేశాడు? అన్నది కథ.
    8 . జానకి రాముడు(ఆగస్టు 19 , 1988)
    UA|133 minutes|డ్రామా,రొమాన్స్
    రాము, జానకి అనే ఇద్దరు ప్రేమికులు. ఒక గ్రామాన్ని సందర్శిస్తారు. అక్కడ వారు తమ గత జీవితాల గురించి నిజం తెలుసుకుంటారు. అయితే తమ తమ గత జీవితంలో జరిగిన దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఈ జన్మలో జాగ్రత్త పడుతారు.
    9 . ప్రెసిడెంట్ గారి పెళ్ళాం(అక్టోబర్ 30 , 1992)
    U|138 minutes|డ్రామా
    స్వప్న, రాజాను ప్రేమిస్తున్నట్లు నమ్మించి గ్రామస్థుల ముందు అవమానిస్తుంది. దీనికి ప్రతీకారంగా.. ఆమె తండ్రిని ఓడించి గ్రామ ప్రెసిడింట్‌గా ఎన్నికవుతానని రాజా సవాలు చేస్తాడు.

    @2021 KTree