
2024 ఏడాదిలో వచ్చిన టాప్ ఫ్యామిలీ & డ్రామా సినిమాల లిస్ట్ ఇదే!
400+ views4 months ago
2024 సంవత్సరం మరో నెలలో ముగియనుంది. ఈ ఏడాదిలో అనేక సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. వాటిలో బెస్ట్ ఫ్యామిలీ సినిమాలను లిస్ట్ చేయడం జరిగింది. ఈ జాబితాలో లక్కీ భాస్కర్, అమరన్, దిగోట్ లైఫ్, దేవర వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. మీ కుటుంబంతో కలిసి ఫ్యామిలీ సినిమాల్లో ఉన్న డెప్త్‌ను ఆనందించండి.

1 . అమరన్(అక్టోబర్ 31 , 2024)
UA|డ్రామా
ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ.

2 . లక్కీ భాస్కర్(అక్టోబర్ 31 , 2024)
UA|డ్రామా
భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది కథ.

3 . ఓం భీమ్ బుష్(మార్చి 22 , 2024)
UA|హాస్యం,డ్రామా
క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.

4 . డెడ్‌పూల్ & వుల్వరైన్(జూలై 26 , 2024)
A|యాక్షన్,హాస్యం,డ్రామా
డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్ కార్ల సేల్స్ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఓ రోజు అతడ్ని టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616కు తీసుకెళ్తారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్ సాయం అవసరం అవుతుంది. అసలు ఎర్త్ 616 అంటే ఏంటి? డెడ్‌పూల్‌ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు? అక్కడ డెడ్‌పూల్ - వాల్వెరైన్ చేసిన సాహసాలు ఏంటి? అన్నది స్టోరీ.

5 . దేవర(సెప్టెంబర్ 27 , 2024)
UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
సముద్రానికి ఆనుకొని కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప, కుంజర ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకు రవాణా చేస్తూ జీవిస్తుంటారు. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి దేవర సరకు దొంగతనం చేయవద్దని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవను దేవర ఎలా అడ్డుకున్నాడు? సముద్రంలోకి వెళ్లిన దేవర ఏమయ్యాడు? అతడి కొడుకు వర (ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? అన్నది స్టోరీ. దేవర చిత్రాన్ని రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు.

6 . ఆవేశం(ఏప్రిల్ 11 , 2024)
UA|డ్రామా
కేరళకు చెందిన ముగ్గురు బెంగళూరులోని ఇంజనీరింగ్ కాలేజీలో చేరతారు. ఓ రోజు సీనియర్లు వారిని ర్యాగింగ్ చేసి అవమానిస్తారు. దీంతో ప్రతీకారం కోసం వారు మలయాళీ లోకల్ గుండా రంగా (ఫహద్ ఫాసిల్)తో పరిచయం పెంచుకుంటారు. అనూహ్య ఘటనల తర్వాత రంగ వారు రంగాకు శత్రువులుగా మారతారు? ఆ తర్వాత ఏమైంది? రంగా వారిని ఎందుకు చంపాలనుకున్నాడు? అన్నది కథ.

7 . నూనక్కళి(ఆగస్టు 15 , 2024)
UA|డ్రామా
భార్యతో కలిసి ఉన్న ప్రైవేటు వీడియోలను ఓ యువ వ్యాపారి తన ల్యాప్‌టాప్‌లో భద్రపరుస్తాడు. ఐటీ అధికారులు ఆ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకోవడంతో కథ అడ్డం తిరుగుతుంది. ఎలాగైన ఆ ల్యాప్‌టాప్‌ను కొట్టేసేందుకు హీరో ఎలాంటి తిప్పలు పడ్డాడు? ఈ క్రమంలో చేసిన తప్పులు ఏంటి? దాని వల్ల ఎదురైన చిక్కులు ఏంటి? అన్నది స్టోరీ.

8 . ది ఫాల్ గై(మే 03 , 2024)
UA|డ్రామా
1980ల్లో వచ్చిన ‘ది ఫాల్ గాయ్’ అనే టీవీ సిరీస్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. భారీ ప్రమాదం నుంచి కోలుకున్న ఓ స్టంట్‍మ్యాన్, కనిపించుండా పోయిన ఓ సినిమా హీరోను ఎలా కనుగొన్నాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఎలాంటి కుట్రలను ఛేదించాడు? అన్నది స్టోరీ.

9 . మంజుమ్మెల్ బాయ్స్(ఏప్రిల్ 06 , 2024)
UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.

10 . క(అక్టోబర్ 31 , 2024)
UA|డ్రామా
అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.

11 . మైదాన్(ఏప్రిల్ 11 , 2024)
UA|డ్రామా,క్రీడలు
1952లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత ఫుట్‌బాల్ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగన్) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ.

12 . ది గోట్ లైఫ్ (మార్చి 28 , 2024)
UA|అడ్వెంచర్,డ్రామా
నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ

13 . అంబాజీపేట మ్యారేజీ బ్యాండు(ఫిబ్రవరి 02 , 2024)
UA|డ్రామా
మల్లి (సుహాస్) అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సభ్యుడు. అక్క పద్మ (శరణ్య ప్రదీప్) స్కూల్ టీచర్. ఓ కారణం చేత ఊరి మోతుబరి వెంకట్‌బాబు - మల్లికీ మధ్య వైరం మొదలవుతుంది. అది పెద్దదై ఊర్లో గొడవలకు దారి తీస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? లక్ష్మి (శివాని నాగారం), మల్లిల ప్రేమ కథ ఏంటి? అన్నది కథ.

14 . అన్వేషిప్పిన్ కండెతుమ్(ఫిబ్రవరి 09 , 2024)
UA|క్రైమ్,డ్రామా,థ్రిల్లర్
ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ.

15 . పుష్ప 2: ది రూల్(డిసెంబర్ 05 , 2024)
UA|యాక్షన్,డ్రామా
పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఓ రోజు సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి (రష్మిక) ఆశగా అడుగుతుంది. పుష్ప ఇందుకు యత్నించగా సీఎం హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్ప (రావు రమేష్)ను సీఎం చేస్తానని సవాలు విసురుతాడు. ఇందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్ర మంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ (ఫహాద్ ఫాజిల్) ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాట పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.

16 . డెమోంటే కాలనీ 2(ఆగస్టు 23 , 2024)
UA|డ్రామా
డెబీ (ప్రియా భవానీ శంకర్) భర్త శ్యామ్ అనుమానస్పదంగా సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఓ పుస్తకం చదవడం వల్లే అతడు చనిపోయినట్లు ఆమెకు తెలుస్తుంది. తన భర్తలాగే ఆ బుక్ చదివిన మరికొందరు కూడా సూసైడ్ చేసుకున్నట్లు గ్రహిస్తుంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ (అరుళ్ నిధి) అతడి కవల సోదరుడు కూడా బుక్ చదువుతారు. ఇది గ్రహించిన డెబీ వారిని ఎలా కాపాడింది? ఇంతకీ ఆ బుక్ వెనకున్న దుష్ట శక్తి ఏంటి? అన్నది స్టోరీ.

17 . షైతాన్(మార్చి 08 , 2024)
UA|డ్రామా
కబీర్ (అజయ్ దేవగణ్) ఓ రోజు తన ఫ్యామిలీతో కలిసి ఫామ్‌హౌస్‌కు వెళ్తాడు. వెళ్లే దారిలో దాబా వద్ద వనరాజ్ (ఆర్.మాధవన్) పరిచయమవుతాడు. అయితే, అదేరోజు రాత్రి కబీర్ ఫామ్‌హౌస్‌కు వచ్చి తలుపుకొట్టి ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని ఛార్జర్ కావాలని అడుగుతాడు.ఇంట్లోకి వచ్చిన వనరాజ్ కబీర్ కుమార్తె జాన్వీని హిప్నటైజ్ చేసి వశపరుచుకుంటాడు. అప్పటినుంచి వనరాజ్ ఏం చెబితే జాన్వీ అదే చేస్తుంది. ఆమె తల్లిదండ్రులపై దాడి చేయడానికి కూడా సిద్ధపడుతుంది. ఇంతకీ వనరాజ్ ఎవరు? కబీర్ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశాడు అనేది మిగతా కథ

18 . విక్కీ విద్యా కా వో వాలా వీడియో(అక్టోబర్ 11 , 2024)
UA|హాస్యం,డ్రామా
1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్ నైట్ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ.

19 . డియర్ నాన్న(జూన్ 14 , 2024)
UA|డ్రామా
కరోనా బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఓ తండ్రి కొడుకుల మధ్య సాగిన ఎమోషనల్ సీక్వెన్స్ ఈ సినిమా. చెఫ్ కావాలని కలలు కనే చైతన్యరావు జీవితంలో కోవిడ్ ఎలాంటి ప్రభావం చూపింది? ఆ టైంలో మెడికల్ షాపుల ప్రాధాన్యత, ఆ షాపుల యజమానులు చేసిన త్యాగాలను సినిమా ప్రధాన కథ వస్తువుగా ఉంటుంది.

20 . మెర్రీ క్రిస్మస్(జనవరి 12 , 2024)
UA|డ్రామా,థ్రిల్లర్
ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్ గతం ఏంటి? అన్నది స్టోరీ.

21 . కేశవ చంద్ర రామావత్ (కేసీఆర్)(నవంబర్ 22 , 2024)
UA|డ్రామా
కేశవచంద్ర చిన్నప్పటి కేసీఆర్‌కు వీరాభిమాని. పెద్దయ్యాక డబ్బున్న ఆసామి కూతురితో పెళ్లి కుదుర్చుకుంటాడు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని శబదం చేస్తాడు. ఆయన్ను ఒప్పించి రప్పించేందుకు హైదరాబాద్‌కు వస్తాడు. అలా నగరానికి వచ్చిన కేశవకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రింగ్ రోడ్డు వల్ల కేశవ ఊరికి వచ్చిన సమస్య ఏంటి? దాని పరిష్కారానికి కేశవ ఏం చేశాడు? అన్నది స్టోరీ.

22 . వాఝై(ఆగస్టు 23 , 2024)
UA|డ్రామా
12 ఏళ్ల వయసున్న శివనందన్, అతని తల్లి, సోదరి, స్నేహితుడి చుట్టూ కథ తిరుగుతుంది. అరటి తోటనే నమ్ముకుని బతికే వాళ్లంతా తమ జీవితాల్లో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? ఆ సమస్యల సుడిగుండం నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది స్టోరీ.

23 . కరటక దమనక(మార్చి 08 , 2024)
UA|యాక్షన్,డ్రామా
విరూపాక్ష (శివరాజ్‌కుమార్), బసవరాజు (ప్రభుదేవా) మోసాలు చేస్తూ బతుకుతుంటారు. ఓ మినిస్టర్‌ను బోల్తా కొట్టించబోయి జైలుకు వెళ్తారు. అక్కడ ఓ ఖైదీని కాపాడటంతో జైలర్ వారిని పని మీద ఓ ఊరికి పంపుతాడు. ఇంతకీ ఆ ఊరి సమస్య ఏంటి? ప్రజలు ఎందుకు వలస వెళ్తున్నారు? వారిని రప్పించేందుకు ఈ ఇద్దరు మిత్రులు ఏం చేశారు? అన్నది స్టోరీ.

24 . వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్(అక్టోబర్ 25 , 2024)
UA|డ్రామా
సెకండ్ పార్ట్‌లో వెనమ్‌తో విడిపోయాక ఎడ్డీ బ్రాక్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవుతాడు. మరోవైపు వెనమ్‌ని కూడా తన గ్రహానికి చెందిన వాసులు వెంటాడుతూ ఉంటాయి. ఇంతలో వీరిద్దరికీ కొత్త ప్రమాదం ఎదురవుతుంది. వేరే లోకంలో బంధించి ఉన్న నల్ అనే సూపర్ విలన్ విడుదలకు అవసరమైన ఒక ఎలిమెంట్ వీరి దగ్గర మాత్రమే ఉంటుంది. దీంతో నల్ సైన్యం కూడా వీరి వెంట పడుతుంది. అప్పుడు ఎడ్డీ, వెనమ్ ఏం చేశారు? నల్‌ను వారు ఎలా ఎదుర్కొన్నారు? అన్నది స్టోరీ.

25 . యాత్ర 2(ఫిబ్రవరి 08 , 2024)
UA|డ్రామా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి రావటానికి గల కారణమేంటి? ఓదార్పు యాత్రకు నాటి నాయకులు సృష్టించిన అడ్డంకులు ఏంటి? వాటిని జగన్ ఎలా అధిగమించారు? అన్నది కథ.

26 . కృష్ణం ప్రణయ సఖీ(ఆగస్టు 15 , 2024)
UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
కృష్ణ (గణేష్) ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఫ్యామిలీలో అడ్జస్ట్ అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. ఈ క్రమంలోనే అనాథ అయిన ప్రణయ అతడికి పరిచయమవుతుంది. తాను కోటీశ్వరుడన్న నిజం దాచి ప్రణయకు కృష్ణ దగ్గరవుతాడు. మరోవైపు కృష్ణను దక్కించుకునేందుకు జాహ్నవి ప్రయత్నిస్తుంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరి చివరికి ఏలాంటి పరిస్థితులకు దారి తీసింది? అన్నది స్టోరీ.

27 . ఛాలెంజర్స్(మార్చి 26 , 2024)
UA|డ్రామా,రొమాన్స్,క్రీడలు
పాపులర్ టెన్నిస్ ప్లేయర్ తాషి (జెండాయా) కోచ్‍గా మారి తన భర్తను ఛాంపియన్‌గా తీర్చిదిద్దుతుంది. ఈ క్రమంలోనే ఆమె మాజీ లవర్, ఒకప్పటి బెస్టీ తాషి జీవితంలోకి వస్తారు. వారిద్దరి రాకతో తాషి లైఫ్ ఎలాంటి రొమాంటిక్ టర్న్ తీసుకుంది? అన్నది స్టోరీ.

28 . సోపతులు(సెప్టెంబర్ 19 , 2024)
UA|డ్రామా
చింటు, గుడ్డు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. కొవిడ్‌తో వారు దూరమవ్వాల్సి వస్తుంది. గుడ్డూ ఫ్యామిలీ సొంతూరికి వెళ్లిపోతారు. దీంతో చింటు ఒంటరి తనం ఫీలవుతాడు. చింటు, గుడ్డూ ఒకరినొకరు కలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారు పడ్డ ఇబ్బందులు ఏంటి? చివరికి కలిశారా? లేదా? అన్నది స్టోరీ.

29 . గురువాయూర్ అంబలనాదయిల్(మే 16 , 2024)
UA|హాస్యం,డ్రామా
రామచంద్రన్‌కు నిశ్చితార్థం జరిగినప్పటికీ బ్రేకప్ అయిన అమ్మాయి గురించే ఆలోచిస్తుంటాడు. దీంతో బావమరిది ఆనంద్ (పృథ్వీరాజ్ సుకుమారన్).. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు రామచంద్రన్‌కు సాయం చేస్తుంటాడు. అయితే ఓ వ్యక్తి కారణంగా వీరి బంధం బీటలు వారుతుంది. ఆ తర్వాత ఏమైంది? రామచంద్రన్ పెళ్లి చేసుకున్నాడా? ఆనంద్ తన భార్యను కలిశాడా? లేదా? అన్నది కథ.

30 . పోగుమీద వేగు తూరమిల్లై(ఆగస్టు 23 , 2024)
UA|డ్రామా
కుమార్ ఓ మార్చురీ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. శ్రీమంతుడి శవాన్ని ఇంటికి చేర్చేందుకు బయలుదేరతాడు. అయితే చనిపోయిన వ్యక్తి కుమారులకు వారసత్వం విషయంలో గొడవలు జరుగుతుంటాయి. మరోవైపు మార్గం మధ్యలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత వ్యాన్ నుంచి డెడ్ బాడీ మిస్ అవుతుంది. అప్పుడు విమల్ ఏం చేశాడు? శవాన్ని ఎవరు తీసుకెళ్లారు? వారసుల నుంచి కుమార్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.