• TFIDB EN
  • Editorial List
    నాగ చైతన్య 'ధూత' వెబ్‌సిరీస్ మాదిరి టాప్ 10 తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌
    Dislike
    500+ views
    12 months ago

    ఇటీవల విడుదలైన 'ధూత' ట్రైలర్ వెబ్‌ సిరీస్‌పై అంచనాలను పెంచేసింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌లో నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించాడు. ఈ వెబ్‌ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే తెలుగులో 'ధూత' లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ను YouSAY TFIDB సేకరించడం జరిగింది. వాటిపై ఓ లుక్ వేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . సిన్(మే 01 , 2020)
    A|రొమాన్స్
    ఇద్దరు యువతులు తమ టీనేజ్‌లో ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియడంతో దూరమవుతారు. చివరికి ఆ ఇద్దరిలో ఓ యువతి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. తమ ప్రేమను నెగ్గించుకోవడానికి మరో యువతి ఏం చేసిందన్నది కథ.

    మహిళా సాధికారత విభాగంలో పనిచేసే ఆనంద్.. ఆడవారి పట్ల గౌరవం ఉన్నట్లు ప్రవరిస్తుంటాడు. నిజానికి స్త్రీలోలుడు. శారీక సుఖం కోసం తన భార్యను హింసిస్తుంటాడు.

    2 . వ్యవస్థ(ఏప్రిల్ 28 , 2023)
    UA|డ్రామా
    యామిని, అజయ్ కొత్తగా పెళ్లైన దంపతులు.. వారి శోభనం గదిలో తుపాకి పేలిన శబ్దం వస్తుంది. అందరు తలుపులు తీసి చూడగా యామిని చేతిలో తుపాకి.. అజయ్ చనిపోయి ఉంటాడు. పోలీసులు యామినిని అరెస్ట్ చేస్తారు. యామిని ఈ కేసు నుంచి బయటపడేందుకు ఏం చేసింది. ఇంతకు అజయ్‌ను చంపింది ఎవరు అనేది మిగిలిన కథ

    యామిని, అజయ్ కొత్తగా పెళ్లైన దంపతులు.. వారి శోభనం గదిలో తుపాకి పేలిన శబ్దం వస్తుంది. అందరు తలుపులు తీసి చూడగా యామిని చేతిలో తుపాకి.. అజయ్ చనిపోయి ఉంటాడు. పోలీసులు యామినిని అరెస్ట్ చేస్తారు. యామిని ఈ కేసు నుంచి ఎలా బయటపడింది అనేది కథ

    3 . ఏటీఎం(జనవరి 20 , 2023)
    UA|క్రైమ్,థ్రిల్లర్
    హైదరాబాద్‌లోని స్లమ్ ఏరియాకు చెందిన జగన్ తన స్నేహితులు కలిసి బ్రతుకుదెరువు కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఓ రోజు ఓ కారును దొంగిలించి, దానిని అమ్ముతారు. అయితే అందులో ఓ విలువైన వస్తువు ఉందని తెలిసి ఆ కారును వెతికేందుకు బయల్దేరుతారు. ఇంతకు ఆ కారులో ఉన్న విలువైన వస్తువు ఏమిటి? దానిని ఎలా కనిపెట్టారు అన్నది మిగతా కథ.

    హైదరాబాద్‌లోని మురికివాడలకు చెందిన నలుగురు యువకులు జీవనోపాధి కోసం చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఓ రోజు రూ.కోటి విలువైన వజ్రాలు ఉన్న కారును దొంగిలిస్తారు.

    4 . పులి మేక(ఫిబ్రవరి 24 , 2023)
    UA|క్రైమ్,థ్రిల్లర్
    హైదరాబాద్ నగరంలో పోలీస్ అధికారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటారు. వీరి హత్యల వెనుక ఓ సీరియల్ కిల్లర్ ఉంటాడు. ఆ నేరస్థున్ని పట్టుకునేందుకు IPS అధికారి కిరణ్ ప్రభ నియమించబడుతుంది. మరి ఆమె ఆ సీరియల్ కిల్లర్‌ను పట్టుకుందా? హంతకుడు పోలీసులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అన్నది మిగతా కథ.

    హైదరాబాద్‌లో ఓ సీరియల్ కిల్లర్ పోలీసు అధికారులను టార్గెట్ చేస్తూ వరుసగా హత్య చేస్తుంటాడు. అతన్ని పట్టుకునేందుకు స్పెషల్ ఆఫీసర్‌గా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ నియమించబడుతుంది.

    5 . రెక్కీ(జూన్ 17 , 2022)
    UA|22–30 minutes|క్రైమ్,థ్రిల్లర్
    తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ వరద రాజులు కొంతమంది దుండగులు హత్య చేస్తారు. అయితే వరద రాజులుతో రాజకీయ వైరం ఉన్న మాజీ మున్సిపల్ చైర్మెన్ రంగనాయకులును అనుమానిస్తారు. ఈ హత్య కేసును ఛేదించేందుకు పోలీస్ అధికారి లెనిన్ రంగంలోకి దిగుతాడు. అసలు వరదరాజులను చంపింది ఎవరు అన్నది మిగతా కథ.

    1990లో తాడిపత్రి గ్రామంలో ఒక కొడుకు తన సొంత తండ్రిని చంపడానికి వ్యక్తులను కిరాయికి పంపిస్తాడు. ఆ విషయం బయటకు తెలియడంతో అతడు ఆత్మహత్య చేసుకుంటాడు.

    6 . దూత S1(డిసెంబర్ 01 , 2023)
    A|డ్రామా,థ్రిల్లర్
    సాగర్ వర్మ (నాగ చైతన్య) జర్నలిస్ట్. కొత్తగా ప్రారంభమైన సమాచార్ దిన పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుంటాడు. ఓ రోజు ధాబాలోకి వెళ్లిన సాగర్‌కు ఓ పేపర్ కటింగ్ కనిపిస్తుంది. అందులో రాసినట్టు కారుకు యాక్సిడెంట్ జరిగి పెంపుడు కుక్క మరణిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని పేపర్ కటింగ్స్ సాగర్ వర్మ కంట పడతాయి. వాటిలో రాసినట్టుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకు కారణం ఏంటి? జరగబోయే ప్రమాదాన్ని ముందే పేపర్లలో రాస్తోంది ఎవరు? అతని ప్రయాణంలో భార్య ప్రియా (ప్రియా భవానీ శంకర్), పీఏ కమ్ జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్), డీసీపీ క్రాంతి (పార్వతి తిరువొతు) పాత్రలు ఏమిటి? అనేది కథ.

    జర్నలిస్ట్ సాగర్ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు వార్త పత్రికల్లో ముందే ప్రతిబింబిస్తుంటాయి


    @2021 KTree