• TFIDB EN
  • Editorial List
    Ravi Teja Top Family Movies: రవితేజకు మంచి పేరు తెచ్చిన కుటుంబ కథా చిత్రాలు
    Dislike
    2k+ views
    11 months ago

    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరైన రవితేజ ఫ్యామిలీ హీరోగానూ గుర్తింపు పొందాడు. ఆయన తీసే సినిమాల్లో కామెడీ, యాక్షన్‌తో పాటు కుటుంబ విలువలకు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. రవితేజ ఇప్పటివరకూ తీసిన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమైపోతుంది. అందుకే రవితేజ సినిమా వచ్చిదంటే పెద్ద ఎత్తున ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు వెళ్లిపోతుంటారు. అంతేగాక టీవీల్లో వచ్చే రవితేజ సినిమాలకు సైతం మంచి ఆదరణే ఉంది. ఈ నేపథ్యంలో రవితేజ తీసిన బెస్ట్‌ కుటుంబ కథా చిత్రాలు మీకోసం..

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ధమాకా(డిసెంబర్ 23 , 2022)
    UA|139 minutes|యాక్షన్,హాస్యం
    ధమాకా చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒకరు ధనవంతుడు, మరొకరు మధ్యతరగతి వ్యక్తి. ధనవంతుడు రవితేజ ఆస్తిని లాక్కోవడానికి జయరామ్‌ ప్రయత్నిస్తాడు. రవితేజ తన ఆస్తిని, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా కథ.
    2 . రాజా ది గ్రేట్(అక్టోబర్ 18 , 2017)
    UA|150 mins|యాక్షన్,హాస్యం,రొమాన్స్
    కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.
    3 . కిక్(మే 08 , 2009)
    UA|162 minutes|యాక్షన్,క్రైమ్,రొమాన్స్
    ఎప్పుడు సాహసాలు అంటే ఇష్టపడే కళ్యాణ్‌తో నైనా విడిపోతుంది. అతన్ని వదిలి కళ్యాణ్‌ను వెంబడిస్తున్న పోలీసును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది.
    4 . బలాదూర్(ఆగస్టు 14 , 2008)
    UA|యాక్షన్
    చంటికి పెదనాన్న రామకృష్ణ అంటే చాలా ఇష్టం. ఓ గొడవ కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోతాడు. రామకృష్ణపై పగతో విలన్‌ అతడ్ని నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతాడు. వాటిని బయట చంటి ఎలా అడ్డుకున్నాడు? అన్నది కథ.

    సూపర్‌ స్టార్‌ కృష్ణతో కలిసి రవితేజ చేసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘బలాదూర్‌’. ఈ చిత్రం థియేటర్లలో యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ టీవీల్లో మాత్రం సూపర్‌ హిట్ అయ్యింది. ముఖ్యంగా గృహిణులు ఈ సినిమాను ఎంతగానో అభిమానించారు. కాగా, ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రానికి ఉదయశంకర్‌ దర్శకత్వం వహించారు. సునీల్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రదీప్‌ రావత్‌ కీలక పాత్రలు పోషించారు.

    5 . విక్రమార్కుడు(జూన్ 23 , 2006)
    UA|161 minutes|యాక్షన్,హాస్యం
    సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రాథోడ్‌ను పోలి ఉండే సత్తిబాబు, అతని మరణం తర్వాత అతని కుమార్తెను దత్తత తీసుకుంటాడు. రాథోడ్ స్థానంలో పోలీసు అధికారిగా వెళ్లి దుష్ట బావూజీ దోపిడీలను అంతం చేస్తాడు.
    6 . భద్ర(మే 12 , 2005)
    UA|డ్రామా
    భద్ర తన స్నేహితుడి చెల్లెలైన అనుని ప్రేమిస్తాడు. ఓ రోజు శత్రువుల దాడిలో అను మినహా అమె ఫ్యామిలీ అంతా చనిపోతుంది. విలన్ల నుంచి అనుని రక్షిస్తానని చనిపోతున్న తన ఫ్రెండ్‌కు భద్ర మాట ఇస్తాడు.
    7 . భగీరథ(అక్టోబర్ 13 , 2005)
    U|161 minutes|డ్రామా
    బుల్లబ్బాయి నలువైపుల నీరున్న గ్రామానికి ప్రెసిడెంట్‌. బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు తీసుకొస్తానని చెప్పి 20 ఏళ్ల క్రితం నగరానికి వెళ్లిన స్నేహితుడి వద్దకు కుమారుడు చందుని పంపిస్తాడు. నగరానికి వచ్చిన చందు.. వెంకటరత్నం కావాలనే ఊరికి బ్రిడ్జి తీసుకురాలేదని తెలుసుకుంటాడు. బ్రిడ్జి తేవడం కోసం చందు ఏం చేశాడు? అన్నది కథ.
    8 . నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్(ఆగస్టు 11 , 2004)
    U|డ్రామా,రొమాన్స్
    తన పెళ్లి పత్రికలను పంపిణీ చేసేందుకు శీను తన గ్రామానికి వచ్చినప్పుడు.. అతని చిన్నప్పటి జ్ఞాపకాలను, ప్రేమను గుర్తుచేసుకుంటాడు.
    9 . అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(ఏప్రిల్ 19 , 2003)
    U|154 minutes|యాక్షన్,ఫ్యామిలీ,రొమాన్స్
    చందుకు కిక్‌బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైన నేషనల్ ఛాంపియన్ కావాలనేది అతని కల. తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. అయితే చందు తల్లి చనిపోయేటప్పుడు... తండ్రి రఘువీర్‌ను కలవమని కోరడంతో అతని జీవితం మారుతుంది.
    10 . ఖడ్గం(నవంబర్ 29 , 2002)
    UA|144 minutes|యాక్షన్,థ్రిల్లర్
    విభిన్న మత నేపథ్యాలు కలిగిన ముగ్గురు వ్యక్తులు ఓ ఉగ్రదాడి వల్ల తమ స్నేహితుడ్ని కోల్పోతారు. మరో దాడికి పాల్పడకుండా ఉగ్రవాదిని ఆపడానికి చేతులు కలుపుతారు. ఆ తర్వాత ఏం చేశారు? ఉగ్రదాడిని ఎలా అడ్డుకున్నారు? అన్నది కథ.

    శ్రీకాంత్‌, రవితేజ, ప్రకాష్‌ రాజ్‌ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ఖడ్గం. ఇందులో రవితేజ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇండస్ట్రీలో అవకాశం కోసం కాళ్లు అరిగేలా తిరిగే యువకుడి పాత్రలో రవితేజ ఒదిగిపోయారు. రవితేజ హావభావాలు ఆ పాత్రకు జీవం పోశాయి.

    11 . అవును వాళ్ళిద్దరూ ఇష్ట పడ్డారు!(ఆగస్టు 02 , 2002)
    U|హాస్యం,రొమాన్స్
    ఒక యువతి, యువకుడు ఒకే ఇంట్లో అద్దెకు ఉంటుంటారు. ఒకరికొకరు ఎదురు పడకుండా లెటర్ల ద్వారా సంభాషణలు జరుపుతుంటారు. ఒకరిపైఒకరు ప్రేమను పెంచుకుంటున్న క్రమంలో ఊహించని విధంగా యువతికి మరో వ్యక్తితో పెళ్లి ఫిక్స్‌ అవుతుంది.
    12 . ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం(సెప్టెంబర్ 14 , 2001)
    U|రొమాన్స్
    ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన శ్రావణి, సుబ్రమణ్యం ఒకరి గతం ఒకరు చెప్పుకుంటారు. చనిపోవడానికి ఒకరికొకరు సాయం చేసుకుంటారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించవు. విధి వారిని దూరం చేస్తుంది. తిరిగి కలుసుకునే ప్రయత్నంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ చిత్రం రవితేజ సినీ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. అప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న రవితేజ హీరోగా నిలదొక్కుకున్నాడు.

    2001లో వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమా ఘన విజయం సాధించింది. ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో రవితేజకు జంటగా తనూ రాయ్‌ నటించింది. చక్రీ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. ముఖ్యంగా ‘మల్లి కూయవే గువ్వా .. మోగిన అందెల మువ్వా’ పాట ఇప్పటికీ శ్రోతల ఆదరణ పొందుతోంది.


    @2021 KTree