• TFIDB EN
 • మిస్టర్ పర్ఫెక్ట్ (2011)
  UTelugu2h 25m

  విక్కీ తన చిన్ననాటి స్నేహితురాలి ప్రియతో జరిగిన నిశ్చితార్థాన్ని బ్రేక్‌ చేసుకుంటాడు. అచ్చం తనలాగే ఆలోచించే మరో యువతితో పెళ్లికి సిద్ధపడతాడు. అయితే ప్రియ తన కోసం ఎంతో త్యాగం చేసిందని గ్రహించిన విక్కీ ఏం చేశాడు అన్నది కథ.

  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
  Watch
  స్ట్రీమింగ్‌ ఆన్‌Youtube
  Watch
  Free
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  ప్రభాస్విక్రమ్ విక్కీ
  కాజల్ అగర్వాల్ప్రియా రావు
  తాప్సీ పన్నుమ్యాగీ దూబే
  మురళీ మోహన్ ప్రియ తండ్రి
  ప్రకాష్ రాజ్ మాగీ తండ్రి
  సాయాజీ షిండేమ్యాగీ అంకుల్
  నాసర్విక్కీ తండ్రి
  కె. విశ్వనాథ్మ్యాగీ తాత
  తులసివిక్కీ అమ్మ
  బ్రహ్మానందంజల్సా కిషోర్ (ప్రియా మామ)
  కాశీ విశ్వనాథ్మ్యాగీ బంధువు
  సమీర్మ్యాగీ బంధువు
  సుదీప పింకీవిక్కీ చెల్లెలు
  రఘు బాబుదూబే బావ
  మాస్టర్ భరత్ప్రియ సోదరుడు
  సత్యదేవ్ కంచరణావిక్కీ స్నేహితుడు
  కృష్ణుడు విక్కీ స్నేహితుడు
  అఖిల్ కార్తీక్ విక్కీ స్నేహితుడు
  కౌశల్ మందప్రియ కోడలు
  బెనర్జీప్రియ బంధువు
  సిబ్బంది
  ఎడిటోరియల్ లిస్ట్
  కథనాలు
  <strong>సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
  సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
   తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో  సత్యదేవ్ ఒకరు. బ్లఫ్‌ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సత్యదేవ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. సత్యదేవ్ అసలు పేరు? సత్యదేవ్ కంచరణా సత్యదేవ్&nbsp; ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు సత్యదేవ్ తొలి సినిమా? మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రం ద్వారా సత్యదేవ్ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యాడు. హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'బ్లప్‌ మాస్టర్'  సత్యదేవ్ ఎక్కడ పుట్టాడు? విశాఖపట్నం, ఏపీ సత్యదేవ్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1989 జులై 4 సత్యదేవ్‌కు వివాహం అయిందా? దీపికతో 2016లో పెళ్లి జరిగింది. 2020లో ఈ జంటకు ఒక కొడుకు జన్మించాడు. పేరు సావర్ణిక్ సత్యదేవ్ ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి సత్యదేవ్ తొలి హిట్ సినిమా? జ్యోతి లక్ష్మి చిత్రం సత్యదేవ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, గాడ్‌ఫాదర్ వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి. సత్యదేవ్‌కు ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ వైట్ సత్యదేవ్ తల్లిదండ్రుల పేర్లు? ప్రసాద్‌ రావు, లక్ష్మి సత్యదేవ్‌కు ఇష్టమైన ప్రదేశం? విశాఖపట్నం &nbsp;సత్యదేవ్ ఏం చదివాడు? ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కొద్దికాలం బెంగుళూరులో పనిచేశాడు. సత్యదేవ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? &nbsp;2024 వరకు 30 సినిమాల్లో నటించాడు.&nbsp; సత్యదేవ్‌కు ఇష్టమైన ఆహారం? దోశ సత్యదేవ్ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7.5 కోట్లు సత్యదేవ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సత్యదేవ్ ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=bLnXyZ4pzhE
  మార్చి 21 , 2024
  Venkatesh Soundarya Movies: వెంకటేష్ సౌందర్య జంటగా నటించిన చివరి చిత్రం ఏదో తెలుసా?
  Venkatesh Soundarya Movies: వెంకటేష్ సౌందర్య జంటగా నటించిన చివరి చిత్రం ఏదో తెలుసా?
  టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా విక్టరీ వెంకటేష్- సౌందర్యకు పేరుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్‌ స్క్రీన్‌పై బాగా పండేది. దాదాపు వీళ్లిద్దరు కలిసి నటించిన సినిమాలన్నీ హిట్లుగా నిలిచాయి. సౌందర్య- వెంకటేష్ జంటగా నటించిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. మరి వెంకటేష్- సౌందర్య కాంబోలో ఎన్ని చిత్రాలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం? సూపర్ పోలీస్ (1994) విక్టరీ వెంకటేష్- సౌందర్య జంటగా నటించిన తొలి చిత్రం సూపర్ పోలీస్. ఈ చిత్రాన్ని కే. మురళి మోహన్‌రావు డైరెక్ట్ చేయగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో జయసుధ కీలక పాత్రలో నటించారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్- సౌందర్య మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో&nbsp; వెంకటేష్- సౌందర్య హిట్ పేయిర్‌గా గుర్తింపు పొందారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. పవిత్ర బంధం (1996) వెంకటేష్- సౌందర్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. టాలీవుడ్‌లో ఈ సినిమా ఆల్‌టైం క్లాసిక్ కల్ట్‌ మూవీల్లో ఒకటిగా నిలిచింది. పవిత్ర బంధం సినిమాను ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్ హిట్ సాధించింది. పెళ్లి చేసుకుందాం(1997)&nbsp;&nbsp; ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మరోసారి వెంకటేష్- సౌందర్య జత కట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు లైలా కూడా నటించింది. రాజా (1999) ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. మరోసారి వెండితెర పర్ఫెక్ట్ పేయిర్ సౌందర్య- వెంకటేష్ జోడీగా నటించారు. ముప్పలనేని శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.&nbsp; ఎస్‌ఏ రాజ్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది. ఈ సినిమా మొత్తం మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. జయం మనదేరా (2000)  ఎన్‌ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్-సౌందర్య మధ్య వచ్చే కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఈ చిత్రంలో వెంకటేష్ డ్యుయల్ రోల్ చేయగా... ఆయన సరసన భానుప్రియ, సౌందర్య నటించారు. దేవీ పుత్రుడు(2001) వెంకటేష్- సౌందర్య నటించిన చివరి చిత్రమిది. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు అంజలా జావేరి కూడా నటించింది.
  నవంబర్ 10 , 2023
  Oscar Award Winning Movies 2024: ఆస్కార్‌ గెలిచిన ఈ సినిమాలు ఎందుకు చూడాలంటే?
  Oscar Award Winning Movies 2024: ఆస్కార్‌ గెలిచిన ఈ సినిమాలు ఎందుకు చూడాలంటే?
  సాధారణంగా అవార్డ్ విన్నింగ్ సినిమా అంటే సినీ ప్రేమికులు చూసేందుకు ఇష్టపడతారు. ఇక ఆస్కార్ దక్కించుకున్న సినిమా అంటే వారి ఆసక్తి ఇక ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయా చిత్రాలు అవార్డు సాధించేంత స్పెషాలిటీ ఆ సినిమాల్లో ఏముందోనని తెలుసుకునేందుకు వారు తెగ వెతికేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా అస్కార్‌ వేడుకలు జరిగాయి. ఇందులో 10 చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆయా చిత్రాల విశేషాలను YouSay మీ ముందుకు తెచ్చింది. అంతేకాకుండా ఆస్కార్‌కు నామినేట్ అయినా చిత్ర వివరాలను సైతం ఈ కథనంలో పొందుపరిచింది. ఆయా సినిమాల కథ, ఏ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది అన్న విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; ఆస్కార్‌ గెలిచిన చిత్రాలు ఓపెన్ హైమర్ (Oppenheimer) అందరూ ఊహించనట్లే ఈసారి 'ఓపెన్ హైమర్' చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రానికి హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోపర్‌ నోలాన్‌ (Christopher Nolan) దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే ఈ సినిమా.. ప్రముఖ అమెరికన్‌ సైంటిస్ట్ జె. రాబర్ట్‌ ఓపెన్‌హైమర్‌ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఫాదర్‌ ఆఫ్‌ ఆటమ్‌ బాంబ్‌గా అతడి జర్నీ ఎలా మెుదలైంది? అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? జపాన్‌లోని హీరోషిమా - నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? ఆ దాడి తర్వాత ఓపెన్‌హైమర్‌ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆపే అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్ తో చూడొచ్చు. అయితే మార్చి 21 నుంచి జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. బార్బీ (Barbie) గ్రెటా గర్‌విగ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఒక&nbsp; ఫాంటసీ కామెడీ ఫిల్మ్. ఒక ట్రాన్స్ జెండర్ ఓ బార్బీ మధ్య జరిగే కథ ఇది. బార్బీ డాల్స్ కోసం నిజంగా ఒక లోకం ఉంటే... తన లోకం వదిలి సదరు బార్బీ డాల్ భూలోకంలో అడుగు పెడితే ఎలా ఉంటుంది. బార్బీ డాల్ పట్ల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది. అసలు బార్బీ తన ప్రపంచం వదిలి భూలోకంలోకి ఎందుకు వచ్చింది? వంటి విషయాల సమాహారమే ఈ మూవీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘బార్బీ’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ‘జియో సినిమా’ ఓటీటీ వేదికలో వీక్షించవచ్చు.&nbsp; పూర్‌ థింగ్స్‌ (Poor Things) ఈ సినిమా కథలోకి వెళ్తే.. అసాధారణ శాస్త్రవేత్త గాడ్విన్‌ బాక్స్‌టర్‌.. చనిపోయిన యువతికి తిరిగి జీవం పోస్తాడు. ఆమె మెదడును కడుపులో ఉన్న బిడ్డతో అనుసంధానం చేస్తాడు. దీంతో శిశువు తెలివితేటలు అసాధారణంగా పెరిగిపోతాయి. బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ప్రయాణం మెుదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ. ఈ చిత్రాన్ని డిస్నీ + హాట్‌స్టార్‌లో చూడవచ్చు.&nbsp; అమెరిన్‌ ఫిక్షన్‌ (American Fiction) అమెరికన్‌ ఫిక్షన్ సినిమా.. ఓ నవలా రచయిత చుట్టూ తిరుగుతుంది. కథలోకి వెళ్తే.. మాంక్‌ ఒక తెలివైన గొప్ప నవలా రచయిత. అతడి నవలలకు అకాడెమిక్‌ ప్రశంసలు లభించినా ప్రచురణకు మాత్రం పెద్దగా నోచుకోవు. నల్లజాతీయుడు కావడం చేత మాంక్‌కు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీంతో విసుగు చెందిన మాంక్‌.. మనసు లోతుల్లో ఎప్పటి నుంచో దాగున్నా అభిప్రాయాలను ఓ పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో మాంక్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది కథ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.&nbsp; అనాటమి ఆఫ్‌ ఏ ఫాల్‌ (Anatomy of a Fall) ఈ సినిమా మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. కథలోకి వెళ్తే.. శామ్యుల్‌, శాండ్రా భార్య భర్తలు. వారిద్దరు తమ బిడ్డ డానియేల్‌తో కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు అనుమానస్పద స్థితిలో శామ్యుల్‌ చనిపోతాడు. పోలీసులు అతడి భార్య శాండ్రాపై అనుమానం వ్యక్తం చేస్తారు. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? శామ్యుల్‌ను హత్య చేసింది ఎవరు? అన్నది కథ. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌&nbsp; (The Zone of Interest) కమాండెంట్‌ రూడొల్ఫ్‌ హాస్‌ తన భార్య, పిల్లలతో కలిసి చెరువుకు ఆనుకొని ఉన్న ఇంటిలో జీవిస్తుంటాడు. అతడి ఇంటి ఆవరణలో ఉండే గార్డెన్‌లో కొందరు బానిసలు పనిచేస్తుంటారు. ఓ రోజు చెరువులో తన పిల్లల మృతదేహాలు రుడోల్ఫ్‌కు కనిపిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; ది హోల్డోవర్స్‌ (The Holdovers) టీచర్‌, స్టూడెంట్‌కు మధ్య ఉండే సంబంధాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ప్రిపరేషన్‌ స్కూల్‌లో క్రాంకీ హిస్టరీ టీచర్‌గా పనిచేస్తుంటాడు. అతడంటే విద్యార్థులకు చాలా భయం. స్కూల్‌కు క్రిస్మస్‌ సెలవులు రావడంతో కొందరు విద్యార్థులు హాలీడేస్‌కు వెళ్లలేకపోతారు. వారికి గార్డియన్‌గా క్రాంకీ ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో చూడవచ్చు.&nbsp; మ్యాస్ట్రో (Maestro) ఈ చిత్రం అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందింది. కండక్టర్‌ - స్వరకర్త లియోనార్డ్ బెర్న్‌ స్టెయిన్‌ ఓ కార్యక్రమంలో నటి ఫెలిసియాను చూసి మనసు పడతాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడటంతో ఇద్దరూ డేటింగ్‌కు వెళ్తారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారు. వారి వైవాహిక బంధం ఎంత మధురంగా సాగింది? ఈ ప్రయాణంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా అధిగమించారు? అన్నది కథ. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; కిల్లర్‌ ఆఫ్‌ ద ఫ్లవర్‌ మూన్‌ (Killers of the Flower Moon) లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1920లో ఒక్లాహోమాలోని ఓసేజ్‌ నేషన్ ల్యాండ్‌ కింద చమురు బయటపడుతుంది. ఆ తర్వాత నుంచి ఆ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఎఫ్‌బీఐ రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది?&nbsp;అన్నది ప్లాట్‌. ప్రస్తుతం ఈ సినిమా ఆపిల్‌ టీవీ ప్లస్‌లో అందుబాటులో ఉంది. ఆస్కార్‌ నామినేషన్స్‌లో నిలిచిన చిత్రాలు ఆస్కార్ గెలిచిన చిత్రాలతో పాటు ఈ అవార్డుల రేసులో నిలిచిన మరికొన్ని చిత్రాల విశిష్టతను ఓసారి తెలుసుకుందాం. పాస్ట్ లైవ్స్‌ (Past Lives) నోరా, హే సంగ్ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. నోరా కుటుంబం దక్షిణ కొరియాకు వెళ్లిపోవడంతో వారు విడిపోతారు. ఇరవై సంవత్సరాల తర్వాత వారు తమ ఒకరికొరు ప్రేమలు ఉన్నట్లు గ్రహిస్తారు. వారు తిరిగి ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. ఈ సినిమాను కూడా అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్‌ విధానంలో చూడవచ్చు. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. సొసైటీ ఆఫ్‌ ది స్నో (Society of the Snow) రగ్బీ బృందంతో ప్రయాణిస్తున్న విమానం.. ప్రమాదవశాత్తు ఆండీస్‌ మంచు పర్వతాల్లో కుప్పకూలుతుంది. ఈ ప్రమాదం నుండి కొందరు ప్రయాణికులు బయటపడతారు. అత్యంత కష్టతరమైన వాతావరణంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. బాహ్య ప్రపంచానికి తాను బతికే ఉన్నామని చెప్పేందుకు వివిధ రకాలు అన్వేషిస్తారు. మరి వారు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది కథ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.&nbsp; లో క్యాపిటనో (Lo Capitano) వలసదారులు పడే కష్టాలకు ఈ చిత్రం అద్దం పడుతుంది. ఇద్దరు నల్లజాతి యువకులు యువకులు చేసే సాహస యాత్రనే ఈ చిత్రం కథ. యూరప్ చేరుకోవడానికి డాకర్ నుండి ఇద్దరు యువకులు సెడౌ, మౌసా బయలుదేరుతారు. గమ్యాన్ని చేరుకునే క్రమంలా వారికి ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని ఎలా అధిగమించారు? చివరికి వారు యూరప్‌ చేరుకున్నారా? లేదా? అన్నది ప్లాట్‌.&nbsp; పర్‌ఫెక్ట్‌ డేస్‌ (Perfect Days) ఆస్కార్‌ నామినేషన్‌లో నిలిచి ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. హిరాయామా అనే వ్యక్తి టోక్యోలో టాయిలెట్ క్లీనర్‌గా పని చేస్తూ సంతృప్తికరమై జీవితాన్ని అనుభవిస్తుంటాడు. క్యాసెట్ టేపులలో సంగీతాన్ని వింటూ, పుస్తకాలు చదువుతూ హాయిగా రోజులు గడుపుతుంటాడు. కొన్ని ఊహించని ఘటనలు అతడి జీవితంలో ఎనలేని మార్పులను తీసుకొస్తాయి.&nbsp; ది టీచర్స్‌ లాంజ్‌ (The Teachers' Lounge) కర్నా నోవాక్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె స్టూడెంట్స్‌లో ఒకరు దొంగతనానికి సంబంధించి అనుమానితుడుగా ఉంటాడు. నిజా నిజాలు తెల్చేందుకు ఆమె రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో ఆమెకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ప్రస్తుతం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.&nbsp;
  మార్చి 11 , 2024
  Mr.Pregnent Review: మిస్టర్ ప్రెగ్నెంట్ డెలివర్ చేసిన మెసేజ్ ఏంటి?
  Mr.Pregnent Review: మిస్టర్ ప్రెగ్నెంట్ డెలివర్ చేసిన మెసేజ్ ఏంటి?
  నటీనటులు: సొహైల్, రూప కొడవయూర్, సుహాసిని, వైవా హర్ష, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, అభిషేక్.&nbsp; దర్శకుడు: శ్రీనివాస్ వింజనంపాటి&nbsp; నిర్మాత: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి&nbsp; సంగీతం: శ్రవణ్ భరద్వాజ్&nbsp;&nbsp; బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం(Aug 18) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సంగీతం ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. ఇటీవల 200 మంది గర్భిణులకు ప్రత్యేకంగా సినిమా స్క్రీనింగ్ చేయించడంతో ప్రేక్షకుల చూపు మూవీపై పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? థియేటర్లలో ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనేది రివ్యూలో చూద్దాం.&nbsp; కథ గౌతమ్ (సొహైల్) అనాథ. అతడికి పిల్లలంటే ఇష్టముండదు. సిటీలో టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు. వృత్తి పరంగా ఉన్నత స్థానంలో ఉంటాడు గౌతమ్. మంచి డిమాండ్ ఉన్న టాటూ ఆర్టిస్ట్. తన స్నేహితులందరూ కుళ్లుకునేంత టాలెంట్ &amp; ఫేమ్ ఉన్న గౌతమ్‌ను మహి (రూప కొడవయూర్) గాడంగా ప్రేమిస్తుంది. మొదట్లో ఆమె ప్రేమను నిరాకరించిన గౌతమ్.. ఆమె ప్రేమలోని నిజాయితీని అర్ధం చేసుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ, పిల్లలు వద్దని చెబుతాడు. ఈ క్రమంలో మహి గర్భం దాల్చిన విషయం తెలుస్తుంది. అయితే, బిడ్డ తన కడుపులో పెరగాలని డిసైడ్ అయ్యి గర్భాన్ని తనకు మార్పిడి చేసుకుంటాడు గౌతమ్. మరి, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆ తర్వాత ఏమైందనేది మిగతా కథ. https://twitter.com/RyanSohel/status/1691410954377220096?s=20 ఎలా ఉందంటే? పురుషుడు గర్భం దాల్చవచ్చా? దాలిస్తే ఎలా ఉంటుందన్న కథాంశం ఆసక్తిని రేపింది. ఈ పాయింట్‌తోనే సినిమా చూడాలనిపిస్తుంది. కాకపోతే, మూవీలో అసలు విషయం దగ్గరికి రావడానికి కాస్త సమయం పడుతుంది. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు, లవ్ ట్రాక్, ఇరికించినట్లుగా అనిపించే కామెడీ ఫస్టాఫ్‌ని బోర్ కొట్టిస్తాయి. కానీ, సొహైల్ నిర్ణయం తర్వాత సినిమా ఆసక్తికరంగా మారింది. సెకండాఫ్‌లో ఎమోషన్ సీన్స్ బాగా పండాయి. గర్భం దాల్చాక ఒకరి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎమోషనల్ కనెక్టివిటీతో చూపించడం ప్రేక్షకుడికి నచ్చుతుంది. గర్భం చుట్టూ జరిగే కామెడీ నవ్వు పుట్టిస్తుంది. చివరికి ఇచ్చిన మెసేజ్ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగా మరీ నాటకీయంగా అనిపిస్తాయి. అయితే, మహిళలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.&nbsp; ఎవరెలా చేశారు? నటనకు ఎంతో స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకున్నాడు సొహైల్. గర్భం దాల్చాక ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా నటించాడు. ద్వితీయార్థంలో సొహైల్ చేసిన యాక్టింగ్ నచ్చుతుంది. చక్కగా భావాలు పలికించాడు. ఇక, రూప తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఇంకొంచెం బాగా చేసే అవకాశం కూడా ఉంది. చాన్నాళ్ల తర్వాత సుహాసిని మణిరత్నంకి మంచి పాత్ర దొరికింది. డాక్టర్‌గా ఆమె బాగా నటించారు. కీలక సన్నివేశాల్లో తను ఆకట్టుకుంది. ఇక, బ్రహ్మాజీ, వైవా హర్ష కామెడీతో అలరించారు. చిన్న పాత్రే అయినా రాజా రవీంద్ర మెప్పించాడు. టెక్నికల్‌గా దర్శకుడు శ్రీనివాస్ క్లిష్టమైన సబ్జెక్ట్‌ని ఎంచుకుని చక్కగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మగాళ్లు గర్భం దాల్చొచ్చనే అంశంపై బాగా రీసెర్చ్ చేసినట్లు అనిపించింది. స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నాడు. కాకపోతే, పాత్రల ఎలివేషన్ కోసం సమయం తీసుకున్నాడు. క్లైమాక్స్ పార్ట్ బాగా వర్కౌట్ చేశాడు. ఇక, సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలం. నిజార్ షఫీ కెమెరా పనితనం ఓకే.&nbsp; https://twitter.com/RyanSohel/status/1691722567441412475?s=20 ప్లస్ పాయింట్స్ సొహైల్ నటన సెకండాఫ్, క్లైమాక్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ ఇరికించిన కామెడీ సీన్లు ఫస్టాఫ్ కాస్ట్యూమ్స్ ఫైనల్‌గా.. మిస్టర్ ప్రెగ్నెంట్ కథ తెలుసుకోవాలంటే మొదటి 45 నిమిషాలు ఓపిక పట్టాల్సిందే.&nbsp;&nbsp; రేటింగ్: 2/5 https://www.youtube.com/watch?v=MDUVa03xbIs
  ఆగస్టు 18 , 2023
  <strong>నిధి అగర్వాల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
  నిధి అగర్వాల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  నిధి అగర్వాల్ తెలుగులో చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా.. యూత్‌ మంతి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్‌లో మిస్టర్ మజ్ను చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో తన గ్లామర్ షోతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. మరి నిధి అగర్వాల్‌కు(Some Lesser Known Facts about Nidhhi Agerwal)&nbsp; ఇంకా ఏమేమి ఇష్టమో ఈ కథనంలో చూద్దాం. నిధి అగర్వాల్ ముద్దు పేరు? నిధి నిధి అగర్వాల్ ఎప్పుడు పుట్టింది? 1993, ఆగస్టు 17న జన్మించింది నిధి అగర్వాల్ తొలి సినిమా? మున్నా మైఖెల్(2017) నిధి అగర్వాల్ తెలుగులో నటించిన తొలి సినిమా? మిస్టర్ మజ్ను(2018) నిధి అగర్వాల్&nbsp; ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు&nbsp; నిధి అగర్వాల్ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ నిధి అగర్వాల్&nbsp; ఏం చదివింది? BBA, క్రిష్ట్ యూనివర్సిటీ ( బెంగుళూరు) నిధి అగర్వాల్&nbsp; అభిరుచులు? షాపింగ్, ట్రావెలింగ్ నిధి అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ నిధి అగర్వాల్‌కు అఫైర్స్ ఉన్నాయా? బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఉన్నయి. నిధి అగర్వాల్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? వైట్, బ్లాక్ నిధి అగర్వాల్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్ నిధి అగర్వాల్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. నిధి అగర్వాల్&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/nidhhiagerwal/?hl=en నిధి అగర్వాల్‌కు గుడి ఎక్కడ కట్టారు? చెన్నైలో కొంతమంది కాలేజీ విద్యార్థులు ఆమెకు గుడి కట్టారు.
  ఏప్రిల్ 06 , 2024
  <strong>నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
  నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  స్వయంకృషితో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగాడు. హీరోగా తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో విమర్శకుల ప్రశంసలు పొందాడు. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో కామెడీ స్టార్‌గా ఎదిగిన నవీన్ పొలిశెట్టి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. నవీన్ పొలిశెట్టి హీరోగా తొలి సినిమా? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నవీన్ పొలిశెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు నవీన్ పొలిశెట్టి&nbsp; ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ నవీన్ పొలిశెట్టి పుట్టిన తేదీ ఎప్పుడు? 1990, డిసెంబర్ 26 నవీన్ పొలిశెట్టికి వివాహం అయిందా? ఇంకా జరగలేదు. నవీన్ పొలిశెట్టి&nbsp; ఫెవరెట్ హీరో? మహేష్ బాబు, అనిల్ కపూర్ నవీన్ పొలిశెట్టి&nbsp; తొలి హిట్ సినిమా? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నవీన్ పొలిశెట్టి గుర్తింపునిచ్చిన చిత్రం? జాతి రత్నాలు నవీన్ పొలిశెట్టి ఇష్టమైన కలర్? &nbsp;బ్లాక్ నవీన్ పొలిశెట్టి&nbsp; తల్లిదండ్రుల పేరు? మంజుల(బ్యాంక్ ఉద్యోగి), రాజ్‌కుమార్( ఫార్మస్యూటిక్ బిజినెస్) నవీన్ పొలిశెట్టి ఇష్టమైన ప్రదేశం? అమెరికా నవీన్ పొలిశెట్టికి ఇష్టమైన సినిమాలు? షోలే నవీన్ పొలిశెట్టి ఏం చదివాడు? సివిల్ ఇంజనీరింగ్(NIT భోపాల్) నవీన్ పొలిశెట్టి అభిరుచులు? &nbsp;ట్రావలింగ్, డ్యాన్స్ చేయడం, రీడింగ్ బుక్స్ నవీన్ పొలిశెట్టి ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.&nbsp; నవీన్ పొలిశెట్టి సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకు రూ.2కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=6SPYe3HkBVo
  మార్చి 21 , 2024
  <strong>హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
  హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  హెబ్బా పటేల్ తెలుగు సినీ నటి. తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో అలా ఎలా? ద్వారా పరిచయమైంది. కుమారి 21F సినిమాతో గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, మిస్టర్, 24 కిస్సెస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెడ్ చిత్రంలో రామ్‌ పొత్తినేని సరసన ఓ ఐటెం సాంగ్‌లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్(Some Lesser Known Facts about Hebba Patel) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు హెబ్బా పటేల్ ఎప్పుడు పుట్టింది? 1989,&nbsp; జనవరి 6న జన్మించింది హెబ్బా పటేల్ తెలుగులో నటించిన తొలి సినిమా? అలా ఎలా(2014) తెలుగులో గుర్తింపునిచ్చిన సినిమా కుమారి 21F(2015) హెబ్బా పటేల్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు&nbsp; హెబ్బా పటేల్ ఎక్కడ పుట్టింది? ముంబై హెబ్బా పటేల్ అభిరుచులు? డ్యాన్సింగ్, స్విమ్మింగ్ హెబ్బా పటేల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ హెబ్బా పటేల్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? వైట్ హెబ్బా పటేల్‌కు ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్, మహేష్ బాబు హెబ్బా పటేల్ పారితోషికం తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. హెబ్బా పటేల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది హెబ్బా పటేల్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/ihebahp/?hl=en https://www.youtube.com/watch?v=kSipyGA5qC0
  ఏప్రిల్ 02 , 2024
  <strong>అఖిల్ (Akhil Akkineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
  అఖిల్ (Akhil Akkineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  అఖిల్ అక్కినేని, నాగార్జున నటవారసుడిగా ఏడాది వయసులోనే సిసింద్రీ(1995) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అఖిల్ బాల నటుడిగా మరేతర చిత్రంలో కనిపించలేదు. అఖిల్ సినిమాల్లోకి రాకముందు ప్రోఫెషనల్‌ స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. క్రికెట్‌లో అఖిల్‌కు మంచి ప్రావీణ్యం ఉంది. మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, హలో వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో&nbsp; స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు అఖిల్ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకుంటున్న&nbsp; అఖిల్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. అఖిల్ అక్కినేని ఎవరు? అఖిల్ అక్కినేని ప్రముఖ నటుడు నాగార్జున- అమల దంపతుల కొడుకు, టాలీవుడ్‌లో దిగ్గజ నటుడు నాగేశ్వరరావు మనవడు అఖిల్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు&nbsp; అఖిల్ ఎక్కడ పుట్టారు? కాలిఫోర్నియా, అమెరికా అఖిల్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1994 ఏప్రిల్ 08 అఖిల్ వివాహం అయిందా? లేదు ఇంకా జరగలేదు అఖిల్‌కి ఇష్టమైన రంగు? బ్లాక్ అఖిల్ అభిరుచులు? డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడటం అఖిల్‌కు ఇష్టమైన ఆహారం? ఫిష్ ఫ్రై అఖిల్&nbsp; అభిమాన నటుడు? నాగార్జున, పవన్ కళ్యాణ్ అఖిల్‌కు స్టార్ డం అందించిన సినిమాలు? మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అఖిల్ ఏం చదివాడు? BBA&nbsp; అఖిల్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 8 సినిమాల్లో నటించాడు https://www.youtube.com/watch?v=-Qq6ff-0uQM అఖిల్ సినిమాకు ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.4- రూ.5కోట్లు తీసుకుంటున్నాడు. అఖిల్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు? ఒక ఫిల్మ్‌ఫెర్, ఒక సైమా అవర్డును పొందాడు.
  మార్చి 21 , 2024
  Miss Shetty Mr Polishetty Review: సూపర్ హిట్.. బొల్డ్ కంటెంట్‌ ఉన్నా.. అనుష్క, నవీన్ పొలిశెట్టి అదరగొట్టారు!
  Miss Shetty Mr Polishetty Review: సూపర్ హిట్.. బొల్డ్ కంటెంట్‌ ఉన్నా.. అనుష్క, నవీన్ పొలిశెట్టి అదరగొట్టారు!
  తారాగణం - అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, తులసి, జయసుధ, నాజర్&nbsp; డైరెక్టర్ - పీ మహేష్ బాబు నిర్మాత -&nbsp; ప్రమోద్ ఉప్పలపాటి, వి.వంశీకృష్ణా రెడ్డి బ్యానర్ - UV క్రియేషన్స్ సంగీతం - రధన్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ క్రేజీ కాంబోను థియేటర్లలో చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఎదురుచూపులకు నేటితో తెరపడింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న సినిమా కావడంతో ఆమె ఫ్యాన్స్‌లో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. అలాగే&nbsp; జాతిరత్నాలు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌ తర్వాత నవీన్ 2 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్‌లోనే అనుష్క మెస్మరైజింగ్ లుక్స్, నవీన్ కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. మూవీ యూనిట్ సైతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది. ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించగా, అనుష్క చెఫ్‌గా కనిపించింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అనుష్క శెట్టికి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిందా లేదో? ఈ సమీక్షలో చూద్దాం.. కథేంటంటే..? మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి శెట్టి( అనుష్క) తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో లండన్‌ నుంచి ఇండియాకు తిరిగి వస్తుంది. అనారోగ్యంతో తల్లి చనిపోయిన తర్వాత అన్విత ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. తల్లి లేని తనకు మరొకరి తోడు, కుటుంబం అవసరం లేదని భావిస్తుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టి( నవీన్ పొలిశెట్టి) స్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. అసలు అన్విత సిద్దూను ఏమి కోరింది.. సిద్దూ తన ప్రేమ కోసం ఏంచేశాడు? పెళ్లి వద్దనుకున్న అన్విత తన మనసు మార్చుకుందా? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. స్టాండప్ కామెడియన్ పాత్రలో నవీన్ పొలిశెట్టి ఒదిగిపోయాడు. మరో ఏ హీరో చేసినా తనలాగా సెట్ కాదు అనేలా జీవించాడు. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించాడు. తాను బయట ఎలా ఉంటాడో సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్‌లో బాగా పర్ఫామ్ చేశాడు. నవీన్ పొలిశెట్టి తాను కనిపించే ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకున్నాడు.&nbsp; హీరోయిన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రం చేసింది. ఆధునిక భావాలున్న యువతి పాత్రలో చక్కగా నటించింది. ఎమోషనల్ సీన్స్‌లో జీవించింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రలో అనుష్క నటించిందనే భావన ఆమె ఫ్యాన్స్‌లో తప్పక కలుగుతుంది.&nbsp; క్లైమాక్స్ సన్నివేశాల్లో అనుష్క యాక్టింగ్ గూస్‌బంప్స్. ఎలా ఉందంటే?&nbsp; రోటిన్ లవ్ స్టోరీస్, సెన్స్‌లెస్ యాక్షన్‌లెస్ సినిమాలతో విసుగెత్తిన ప్రేక్షకులకు ఈ సినిమా ఫ్రేష్ ఫీల్‌ను అయితే అందిస్తుంది. పెళ్లి చేసుకోకుండా తల్లికావాలనుకే ఓ యువతికి.. ఆమెతో ప్రేమలో పడే ఓ యువకుడి సంఘర్షణను డైరెక్టర్ పీ మహేష్ బాబు చక్కగా తెరకెక్కించాడు. లవ్ స్టోరీతో ముడిపడి ఉన్న ‘స్పెర్మ్ డోనేషన్’ వంటి సున్నితమైన కథాంశాన్ని ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాడు.&nbsp; ఇక సినిమా ఫస్టాప్ ఫుల్ హెలారీయస్‌గా నడుస్తుంది. ఈ క్రెడిట్ నవీన్‌ పొలిశెట్టికే దక్కుతుంది. నవీన్ స్టేజ్ పర్ఫామెన్స్ కడుపుబ్బ నవ్విస్తుంది.&nbsp; ఫస్ట్ 30 నిమిషాలు కాస్త స్లో అయినప్పటికీ నవీన్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో సినిమాను ట్రాక్‌లోకి తెచ్చాడు. ఫస్టాఫ్‌లో వన్‌మ్యాన్ షో చేశాడు. నవ్వించే వన్-లైనర్స్‌తో పాటు, సెంటిమెంట్ జోన్‌లోని డైలాగ్‌లు ‘క్రిస్ప్ అండ్ సెన్సిబుల్‌’గా ఉన్నాయి. ఇక సెకండాఫ్‌లో సినిమాకు మంచి ఎలివేషన్ సీన్లు పడ్డాయి. ఎమోషనల్‌గా సాగుతుంది. ఫర్టిలిటీ ఎలిమెంట్ కారణంగా కొన్ని సార్లు కామెడీ శృతిమించినట్లు అనిపిస్తుంది. కానీ దానిని డైరెక్టర్ చాలా క్లీన్‌గా మెనేజ్ చేశాడు. డైరెక్షన్ ఎలా ఉందంటే? మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి కథాంశం ఎంచుకోవడం పట్ల డైరెక్టర్ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇలాంటి స్టోరీని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలంటే అంత సులువు కాదు. డైలాగ్స్ రైటింగ్ నుంచి భావోద్వేగాలను పండిచడం వరకు డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక మిగతా నటీనటుల విషయానికొస్తే.. మురళి శర్మ, అభినవ్ గోమఠం తమ పాత్రల పరిధిమేరకు నటించారు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించారు. బలాలు నవీన్ పొలిశెట్టి నటనఅనుష్క పర్ఫామెన్స్వన్‌లైన్ కామెడీ పంచ్‌లు బలహీనతలు సెకండాఫ్‌లో నిడివి ఎక్కువ ఉండటంసినిమాలోని పాటలు టెక్నికల్ పరంగా.. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమా చాలా రిచ్ ఫీలింగ్ ఇస్తుంది. నిర్మాణం పరంగా ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదు. రాధన్ అందించిన BGM బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. సెకండాఫ్ కాస్త లాగ్‌ అనిపించినప్పటికీ క్లైమాక్స్ సీన్లు దానిని కవర్ చేశాయి. చివరగా.. రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలతో వేగిన ప్రేక్షకులకు.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి వినోదాన్ని పంచుతుంది. రేటింగ్ 4/5
  సెప్టెంబర్ 07 , 2023
  This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
  This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
  ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. సెప్టెంబర్‌ 4 నుంచిసెప్టెంబర్‌ 10 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు జవాన్‌ బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’ ఈ వారమే థియేటర్లలోకి రానుంది. తమిళ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో షారుక్‌కు జోడీగా నయనతార నటించింది. విజయ్ సేతుపతి విలన్‌గా చేశారు. ఈ మూవీలో షారుక్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. జవాన్ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్‌ను పెంచేశాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. పి.మహేశ్‌ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్‌&nbsp;నిర్మించారు. కాగా, ఈ చిత్రం కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. సెప్టెంబర్‌ 7న (శుక్రవారం) విడుదల కాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు జైలర్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన బ్లాక్‌బాస్టర్‌ చిత్రం ‘జైలర్‌’ ఈ వారం ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్‌ 7న అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మూవీని వీక్షించవచ్చు. ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.600కోట్లకుపై గ్రాస్ కలెక్షన్లను సాధించింది. జైలర్ చిత్రానికి&nbsp; నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. &nbsp; TitleCategoryLanguagePlatformRelease DateShane GillisMovieEnglishNetflixSep 05Scout’s HonorMovieEnglishNetflixSep 05kung fu panda 3SeriesEnglishNetflixSep 07top boy season 2SeriesEnglishNetflixSep 07One shotSeriesEnglishAmazon primeSep 07Sitting in Bars With CakeMovieEnglishAmazon primeSep 06i'm groot season 2SeriesEnglishDisney + HotstarSep 06LoveMovieTamilAhaSep 08Love on the roadMovieEnglishBook My ShowSep 08 .
  సెప్టెంబర్ 04 , 2023
  Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకే!
  Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకే!
  టాలీవుడ్‌ ప్రముఖ కథానాయికల్లో అనుష్క శెట్టి ఒకరు. పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఆపై అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, బాహుబలి వంటి చిత్రాలతో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకుంది. అయితే బాహుబలి తర్వాత అనుష్క కెరీర్‌ పూర్తిగా చతికిలపడింది. దీనికి కారణం ఆమె తీసిన ‘సైజ్‌ జీరో’ చిత్రం. 2015లో వచ్చిన ఈ మూవీ కోసం అనుష్క బరువు పెరిగింది. మూవీ అనంతరం తగ్గేందుకు యత్నించినా అది వర్కౌట్‌ కాలేదు. దీంతో ఈ భామకు సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. అయితే తాజాాగా యంగ్‌ హీరో నవీన్‌కు జతగా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంలో అనుష్క నటించింది. సోమవారం (ఆగస్టు 21) విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సెప్టెంబర్ 7న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను బట్టి చూస్తే మరో వైవిధ్యమైన ప్రేమకథతో అనుష్క తన అభిమానులను మెస్మరైజ్ చేయబోతున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాలో అనుష్క షెఫ్‌గా, నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించారు. ప్రేమ, రిలేషన్‌షిప్స్, పెళ్లి మీద అస్సలు ఆసక్తి, నమ్మకం లేని అమ్మాయిగా అనుష్క కనిపించింది. అలాంటి అమ్మాయి హీరోని ఇష్టపడుతుంది. కానీ పెళ్లి చేసుకోవడానికి కాదు. గర్భం దాల్చడానికి అతడిని హెల్ప్ అడుగుతుంది. ఇదేంటో అర్థంకాక గందరగోళ పరిస్థితిలో హీరో పడతాడు. ఇదే విషయాన్ని ట్రైలర్‌లో ఆసక్తికరంగా చెప్పారు. సరికొత్త ప్రేమకథను ఎంటర్‌టైనింగ్‌, ఎమోషనల్‌గా చెప్పడానికి దర్శకుడు మహేష్ సిద్ధమయ్యారు.&nbsp; అనుష్క.. గ్రేట్‌ కమ్‌బ్యాక్‌! ఈ సినిమాకు ముందు వరకు పెద్దగా అవకాశాలు లేక అనుష్క ఎంతగానో ఇబ్బంది పడింది. సుదీర్ఘకాలం పాటు మూవీస్‌కు దూరమైంది. దీంతో ఇక అనుష్క కెరీర్‌ అయిపోయినట్లేనని అంతా భావించారు. ఫ్యాన్స్‌ కూడా దాదాపు ఇదే అభిప్రాయానికి వచ్చేశారు. అనుష్కను ఇక వెండితెరపై చూడలేమా అని అనుకుంటున్న సమయంలో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రం ద్వారా ఈ భామ గ్రేట్ కమ్‌ బ్యాక్‌కు సిద్దమైంది. ఈ సినిమా ట్రైలర్‌లో మునుపటి ‌అనుష్కను స్వీటీ గుర్తు చేసింది. తన గ్లామర్‌, గ్రేస్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. హీరో ప్రభాస్‌ సైతం ట్రైలర్‌ చూసి అద్భుతంగా ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ట్రైలర్‌ ఆధ్యాంతం కడుపుబ్బా నవ్వించిందని పేర్కొన్నాడు. పలువురు సినీ ప్రముఖులు సైతం ట్రైలర్‌ను మెచ్చుకుంటున్నారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు.&nbsp; రెమ్యూనరేషన్‌ ఎంతంటే? ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా కోసం అనుష్క భారీగానే రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అనుష్క నటించినందుకు మేకర్స్‌ ఆమెకు రూ.6 కోట్లు చెల్లించారని సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సినిమాలకు దూరమైనప్పటికీ అనుష్క క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అంచనాలకు ‌అనుగుణంగా ఈ చిత్రం భారీ విజయం సాధిస్తే తిరిగి అనుష్క టాలీవుడ్‌లో బిజీ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అటు స్వీటి అభిమానులు సైతం ఇదే జరగాలని కోరుకుంటున్నారు.
  ఆగస్టు 22 , 2023
  ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
  ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
  గత వారం సార్, వినరో భాగ్యము విష్ణు&nbsp; కథ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. అయితే, ఈ వారం(ఫిబ్రవరి 24) థియేటర్లలో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీలో మాత్రం సంక్రాంతి సినిమాలు మోత మోగించనున్నాయి. అవేంటో చూద్దాం.&nbsp; మిస్టర్ కింగ్ కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ కింగ్’. దివంగత విజయ నిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా నటించాడు. శశికుమార్ చావలి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా విడుదలవుతోంది.&nbsp; డెడ్‌ లైన్&nbsp; ఊహించిన విధంగా కథనంతో ‘డెడ్‌లైన్’ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం ప్రకటించి అంచనాలు పెంచింది. అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ నెల 24న విడుదలవుతోంది.&nbsp; కోనసీమ థగ్స్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రఫర్ బృందా గోపాల్ డైరెక్ట్ చేసిన రెండో చిత్రమే ‘కోనసీమ థగ్స్’. ప్రొడ్యూసర్ రిబూ తమీన్స్ కుమారుడు హిద్రూ పరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘థగ్స్’గా రూపుదిద్దుకున్న ఈ అనువాద చిత్రాన్ని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగులో ‘కోనసీమ థగ్స్’గా విడుదల చేస్తోంది.&nbsp; OTT విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateVarasuduMoviesTamilAmazon PrimeFebruary 22Veerasimha ReddyMoviesTeluguDisney Plus HotstarFebruary 23MichaelMoviesTeluguAhaFebruary 24Waltheru VeeraiyaMoviesTeluguNetflixFebruary 27The StraysMoviesEnglishNetflixFebruary 22Call me ChichiroMoviesEnglishNetflixFebruary 23Rabia and OliviaMoviesEnglishHotstarFebruary 24Potluck S2SeriesHindiSonyLivFebruary 24A Quite PlaceMovieEnglishNetflixFebruary 24Puli MekaSeriesTeluguZee5February 24
  ఫిబ్రవరి 22 , 2023
  EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
  EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
  'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.&nbsp; టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి&nbsp; ఓసారి చూద్దాం. అడవి శేషు(Adivi Sesh) ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు.&nbsp; 'కర్మ' అనే సినిమాతో&nbsp; డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.&nbsp; విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు.&nbsp; మరో నాలుగేళ్ల తర్వాత&nbsp; దాస్‌ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్‌ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు.&nbsp;అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్‌ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆర్‌ నారాయణ మూర్తి(R. Narayana Murthy) విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ &amp;సూపర్ స్టార్ కృష్ణ లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే&nbsp; అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే&nbsp; డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
  ఏప్రిల్ 01 , 2024
  Kriti Kharbanda: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న రామ్‌ చరణ్ అక్క... అబ్బాయి ఎవరంటే?
  Kriti Kharbanda: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న రామ్‌ చరణ్ అక్క... అబ్బాయి ఎవరంటే?
  ‘బ్రూస్‌లీ’ సినిమాలో రామ్‌చరణ్‌ సోదరిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన కృతి కర్బందా (Kriti Kharbanda) ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. అనూహ్యంగా ఓ బాలీవుడ్‌ నటుడుతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని వార్తల్లో నిలిచింది.&nbsp; మెగా హీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈ భామ.. గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయింది. తాజాగా ఈ భామ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు బయటకు రావడంతో ఒక్కసారిగా కృతి కర్బందా పేరు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; https://twitter.com/Network10Update/status/1752266129991708697 బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ సామ్రాట్‌తో (Pulkit Samrat) ఆమె ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు వైరల్‌ అవుతున్న ఫొటోలను బట్టి తెలుస్తోంది. గత కొంత కాలం నుంచి వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.&nbsp; కృతి-పులకిత్‌ జంట (Pulkit Samrat and Kriti Kharbanda) నిశ్చితార్థం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; ఈ జంట ఫొటోలను చూసిన నెటిజన్లు.. ఈ జోడీ (Kriti Kharbanda Engagement) బాగుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. పెళ్లిరోజు ఎప్పుడో చెప్పాలంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా, వచ్చే నెలలో వీరి పెళ్లి ఉండవచ్చని సమాచారం.&nbsp; అయితే కృతి - పులకిత్‌ రిలేషన్‌షిప్‌ గురించి నాలుగేళ్ల క్రితమే వార్తలు వచ్చాయి. వారు చాలా దగ్గరైనట్లు డేటింగ్‌ కూడా చేస్తున్నట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆ రూమర్లకు నిశ్చితార్థంతో ఈ జంట ఫుల్‌స్టాప్‌ పెట్టింది.&nbsp; దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా (Pulkit Samrat and Kriti Kharbanda).. 'బోణీ' (Boni Movie) అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది.&nbsp; ఆ తర్వాత టాలీవుడ్‌లోనే ‘తీన్‌మార్’ (Teenmar), ‘అలా మొదలైంది’ (Ala Modalaindi), మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర చిత్రాలు చేసింది.&nbsp; చివరగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' (Bruce lee) మూవీలో రామ్ చరణ్‌ (Ram Charan)కి అక్కగా నటించింది. ఇందులో ఆమెన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా రామ్‌చరణ్‌ - కృతి కర్బందా మధ్య (Ram Charan Sister) వచ్చే సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. అక్కా-తమ్ముడిగా వీరిద్దరు జీవించారని చెప్పవచ్చు. వీళ్ల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా చాలా సహజసిద్ధంగా అనిపించాయి. https://twitter.com/i/status/1052216173801168896 ఇక గ్లామర్ పరంగా సూపర్ ఉన్నప్పటికీ ఈమెకు (Kriti Kharbanda Engagement) తెలుగులో ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీపై ఆమె పూర్తి ఫోకస్ పెట్టింది. అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీ (Bollywood)లోనే సినిమాలు చేస్తూ కాస్తంత బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నటుడు పులకిత్‌ సామ్రాట్‌తో ప్రేమలో పడటం గమనార్హం. హిందీలో 2016-17 సంవత్సరాల్లో వరుసగా 'రాజ్‌: రీబూట్‌' (Raaz: Reboot), గెస్ట్‌ ఇన్‌ లండన్‌ (Guest iin London), షాది మీన్‌ జరూర్‌ ఆనా (Shaadi Mein Zaroor Aana)చిత్రాలు చేసింది.&nbsp; 2018-19లో ‘వీరేకి వెడ్డింగ్‌’, ‘యమ్లా పగ్లా దీవానా: పిర్‌ సే’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘పాగల్‌పంతి’ చిత్రాల్లో మెరిసింది.&nbsp; ఆ తర్వాత ‘తైష్‌’, ‘14 ఫిరే’ సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో మంచి నటిగా (Kriti Kharbanda Engagement) తన ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తద్వారా హిందీలో ప్రముఖ హీరోయిన్ల సరసన స్థానం సంపాదించింది.&nbsp; ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘రిస్కీ రోమియో’ అనే చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా సన్నీ సింగ్‌ (Sunny Singh) నటిస్తున్నాడు. అతడు ఆదిపురుష్‌ చిత్రంలో లక్ష్మణుడి పాత్ర పోషించడం గమనార్హం.
  జనవరి 30 , 2024
  Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ నడుము మడతలు.. చూపు తిప్పుకొకుండా ఉండగలరా? 
  Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ నడుము మడతలు.. చూపు తిప్పుకొకుండా ఉండగలరా? 
  బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Jhanvi Kapoor) ‘69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2024’ (69th Filmfare Awards 2024) ఈవెంట్‌లో సందడి చేసింది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లతో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. ఈ బ్యూటీ అందాలను చూసి వేడుకకు వచ్చిన వారంతా ఫిదా అయ్యారు.&nbsp; వేదికపై అద్భుతమైన డాన్స్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన జాన్వీ... మాస్ స్టెప్పులతో అక్కడి వారిని ఉర్రూతలూగించింది.&nbsp; స్టేజీపై జాన్వీ ప్రదర్శనను చూసిన బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ చప్పట్లతో ఆమెను అభినందించారు. అటు జాన్వీ పర్‌ఫార్మెన్స్‌కు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకల్లోనే జాన్వీ టైట్‌ ఫిట్‌ బ్లాక్‌ డ్రెస్‌లోనూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె షేర్‌ చేసింది.&nbsp; నల్లటి దుస్తుల్లో జాన్వీ అందాలను చూసిన నెటిజన్లు ఉర్రూతలూగుతున్నారు. తల్లి శ్రీదేవికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో అలరిస్తున్న జాన్వీ కపూర్.. త్వరలో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకోబోతోంది. కోలివుడ్‌ హీరో సూర్య నటిస్తున్న 'కర్ణ' (Karna) చిత్రంలోనూ ఈ భామకు ఛాన్స్‌ చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి. జాన్వీ కపూర్.. ‘ధడ్‌’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం యావరేజ్‌ టాక్ తెచ్చుకోవడంతో జాన్వీకి పెద్దగా పేరు రాలేదు. నటనపరంగా జాన్వీకి గుర్తింపు తెచ్చిన సినిమా ‘గుంజన్ సక్సేనా’. నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రంలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ‘గుడ్‌లక్‌ జెర్రీ’, ‘మిలి’, ‘బవాల్‌’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా సక్సెస్‌ రాలేదు. ఇటీవల 'రాఖీ ఔర్‌ రానీకి ప్రేమ్‌ కహానీ' చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి జాన్వీ అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ‘మిస్టర్ అండ్ మిస్ మహీ’ చిత్రంలో నటిస్తూ బిజీగా బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని శరణ్‌శర్మ తెరకెక్కిస్తున్నారు.&nbsp;
  జనవరి 30 , 2024
  Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్‌- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
  Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్‌- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
  టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మ. 2.48 నిమిషాలకు వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్‌-ఉపాసన, బన్నీ దంపతులు సందడి చేశారు.&nbsp; అంతకుముందు పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్‌టేల్‌ పార్టీ (Cocktail party) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ పసుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు #VarunLav హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే వరుణ్‌ లావణ్య జంట ఇటలీనే పెళ్లి వేదికగా ఎందుకు ఎంచుకుందన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్ పాయింట్స్ ఉండగా ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చాలా మంది ప్రశ్న. అయితే దీనికి ఓ ప్రధాన కారణమే ఉన్నట్లు సోషల్‌ మీడియాలో&nbsp; ప్రచారం జరుగుతోంది.&nbsp; వివరాల్లోకి వెళితే.. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాతో వరుణ్‌ తేజ్‌ - లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్‌లోనే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. కాలక్రమేణా ఇద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. అయితే ఆ సినిమా ఇటలీలోని షూటింగ్ జరుపుకోవడం విశేషం. అలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు తొలి అడుగు ఇటలీలోనే పడింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి తన ప్రేమను ఇటలీలోనే వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆ విధంగా తమ ప్రేమకు మూలమైన ఇటలీని, తాము పెళ్లి చేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు ఈ జంట. అంతేకాదు సుందరమైన ప్రాంతాలతో ఇటలీలోని టస్కనీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్ దంపతులు, నిహారిక, లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరయ్యారు. సమంత, నాగచైతన్య, రష్మిక మందాన, పూజ హెగ్డే కూడా వీరి పెళ్లికి హాజరైనట్లు తెలిసింది.&nbsp;
  నవంబర్ 01 , 2023
  Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్‌ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్?
  Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్‌ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్?
  మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి విదేశాల్లో వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం కాబోయే భర్త వరుణ్‌తో&nbsp; అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కాస్త హాట్ లుక్‌లో కనిపించింది. వంకాయ కలర్ డ్రెస్‌లో సోగసుల విందు చేసింది. స్లీవ్ లెస్‌టాప్‌లో మెరసిపోయింది.&nbsp; లావణ్య త్రిపాఠి టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన ఈ భామ తన అందం, నటనతో చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.&nbsp; భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి సినిమా హిట్స్&nbsp; ఈ సొట్ట బుగ్గల చిన్నదాని ఖాతాలో ఉన్నాయి.  విభిన్న పాత్రలు చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉండే లావణ్య అంతరిక్షం లాంటి భిన్నమైన సినిమాలోనూ నటించింది. కుర్రహీరోల నుంచి అగ్రహీరోల సరసన పలు హిట్ సినిమాల్లో నటించినా... ఎందుకనో లావణ్యకు అవకాశాలు బాగా తగ్గాయి. రీసెంట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం జరుపుకోవడంతో ఒక్కసారిగా లావణ్య టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.  మిస్టర్ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్.  ఇక వీరి లవ్ స్టోరీ విషయానికి వస్తే.. ఈ ఇద్దరూ 2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో మొదటి సారి కలిసి నటించారు.&nbsp; ఈ సినిమాలో ఇటలీలో షూటింగ్ జరుపుకుంది. &nbsp;ఆక్రమంలోనే ఇద్దరి అభిప్రాయాలు కలిసి తొలుత స్నేహితులుగా మారి తర్వాత పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు. విశేషమేమిటంటే.. వీరి పెళ్లి తర్వాత.. హనీమూన్‌ను వారి ప్రేమకు బీజం వేసిన ఇటలీలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారంట. ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే...&nbsp; శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ముకుందాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.&nbsp; క్రిష్ కంచె మూవీతో నటనలో పరిణతి చెందాడు. &nbsp; అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన F2, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాడు. రీసెంట్‌గా రిలీజైన గాండీవధారి అర్జున ఆశించినంత విజయం సాధించకపోవడంతో నిరాశలో ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే అతని బాధను తగ్గించేందుకు వెకేషన్ చేపట్టారు వరుణ్- లావణ్య త్రిపాఠి.
  సెప్టెంబర్ 06 , 2023
  janhvi kapoor:&nbsp; లేత పరువాలను అడ్డు చీరలో దోపుకున్న జాన్వీ కపూర్.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ అందాల ప్రదర్శన
  janhvi kapoor:&nbsp; లేత పరువాలను అడ్డు చీరలో దోపుకున్న జాన్వీ కపూర్.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ అందాల ప్రదర్శన
  బాలీవుడ్ అందాల క్వీన్ జాన్వీ కపూర్ ఒక్కసారిగా రవివర్మ కుంచె గీసిన బొమ్మగా మారిపోయింది. పరువాలను అడ్డు చీరలో దోపుతూ ఫొటో షూట్‌కు పొజులిచ్చింది. అచ్చం రవివర్మ గీసిన పెయింటింగ్‌లా ఉందంటూ సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలను నెటిజన్ల తెగ పొగుతుతున్నారు. కేరళ కుట్టిలా ముస్తాభై నేల మీద కూర్చోని అందాలను అమర్చింది ఈ కొంటె పిల్ల. జబ్బల అందాలు, సొగసైన ఎద అందాల అచ్చాదనను ఎకరువు పెడుతూ తళుక్కున మెరిసింది ముగ్దమైన కళ్లు, సగం తెరుచుకున్న ఎర్రని లాలీపప్స్ వంటి పెదాలు, పొడవైన నల్లని జుట్టులో దోపిన కలువ పూల అందాల్లో జాన్వీ అందాలకే అందంగా నిలిచింది. అతిలోక సుందరి శ్రీదేవికి తగిన తనయగా తన అందానికి మరింత హంగులు అద్దింది. చూపు తిప్పుకోలేని భంగిమలో కుర్రకారును టెంఫ్ట్ చేస్తోంది.  రాఖీ పండగ సందర్భంగా కవ్వించే సొగసులతో కుదురుగా ఉండనివ్వడం లేదంటే నమ్మండి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. దీంతో కుర్రాళ్లు తమ పదునై కామెంట్లకు పని చెబుతున్నారు. ఈ ఫొటోలను ట్యాగ్ చేస్తూ ... ఇది ఆర్ట్ గొప్పతనం అంటూ పోస్ట్ చేసింది. ఇక పోస్ట్‌కు రిప్లే ఇస్తూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. జాన్వీ అందాలను పొగుడుతూ తమలోని కామెంట్ల కవిత్వానికి పని చెప్పారు. లుకింగ్ గార్జియస్, డ్రీమీ, ఏంజెల్‌లా ఉన్నావని కొందరూ, అతిలోక సుందరిని మించిపోయావంటూ తెగ పొగుడుతున్నారు.  స్టార్ కిడ్ అయినప్పటికీ జాన్వీ బాలీవుడ్‌లో గొప్పగా అయితే లాంచ్‌ కాలేదు. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ నటనలో పరిపక్వతను సాధిస్తోంది. తాజాగా వరుణ్‌ దావణ్‌తో `బవాల్‌` చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ నటన పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.  ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రశంసలందుకుంది.  ఇప్పుడు ఈ సొగసుల సోయగం తెలుగులో భారీగా ఎంట్రీ ఇస్తోంది. కొరటాల శివ- జూ. ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర సినిమాలో మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. గతంలో ఎన్టీఆర్‌పై తన ఇష్టాన్ని పలు ఇంటర్వ్యూలో పంచుకున్న ఈ అల్లరి పిల్ల నేరుగా ఆయన పక్కన హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేయడం విశేషం.  అయితే దేవర కంటే ముందుగానే జాన్వీ.. లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావాల్సి ఉంది. కానీ కుదరలేదు.  అయితే ఆ సినిమాలో నటించకపొవడం జాన్వీకి మంచే చేసిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న 'దేవర' సినిమా ఆమె కెరీర్‌కు మంచి బూస్టింగ్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తన తల్లి శ్రీదేవి లాగా పాన్ ఇండియన్ హీరోయిన్‌గా ఎదిగేందుకు అన్ని విధాల దేవర సినిమా అయితే ఉపయోగపడనుంది. ఈ సినిమా ద్వారా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ జాన్వీ పరిచయం కానుంది. ప్రస్తుతం దేవర సినిమాతో పాటు హిందీలో.. మిస్టర్ అండ్ మిసెస్ మహీ, ఉలజ్ సినిమాల్లో నటిస్తోంది. అడపాదడపా చిత్రాలు చేస్తున్నా జాన్వీకి మాత్రం బిగ్‌ బ్రేక్ రాలేదు. మరి జూ. ఎన్టీఆర్ దేవరతో ఆ బ్రేక్ వస్తుందో చూడాలి మరి.
  ఆగస్టు 31 , 2023
  Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
  Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
  స్టార్‌ హీరోల పక్కన యంగ్ హీరోయిన్లు నటించడం మాములే. కానీ స్టార్‌ హీరోయిన్‌ల పక్కన ఓ యంగ్ హీరో నటించడం అరుదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, అనుష్క శెట్టి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు యంగ్‌ హీరోలతో జతకడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. వరుస ఫ్లాపులు, చేతిలో సినిమాలు లేకపోవడంతో వీరంతా చిన్న హీరోలతోనూ రొమాన్స్‌ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.&nbsp; సమంత అగ్రకథానాయిక అయిన సమంత.. డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న ‘ఖుషీ’ సినిమా పూర్తికాగనే ఆ చిత్రం పట్టాలెక్కుతుందని టాక్.&nbsp; సమంత - సిద్ధూ జంటగా చేయబోయే సినిమాకు మహిళా డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ కథను సిద్ధూ సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.&nbsp; ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమాలోనూ సమంతకు జంటగా యంగ్‌ హీరో దేవ్‌ మోహన్‌ నటిేంచాడు. సినిమా ఫ్లాప్‌ అయినా వీరి మధ్య కెమెస్ట్రీ బాగానే కుదిరినట్లు వార్తలు వచ్చాయి.&nbsp; అనుష్క శెట్టి అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి సినిమాల ద్వారా హీరోయిన్‌ అనుష్క శెట్టి ఎంతో క్రేజ్ సంపాదించింది. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈ భామ కుడా యంగ్‌ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైంది.&nbsp; ‘మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో యువ హీరో నవీన్‌ పొలిశెట్టికి జోడీగా నటించింది. పి. మహేష్‌ బాబు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాట్రైలర్‌ ఆకట్టుకుంది.&nbsp; వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న అనుష్క కెరీర్‌ను 2015లో వచ్చిన జీరో సైజ్‌ సినిమా దెబ్బతీసింది. సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క తిరిగి తగ్గలేకపోయింది. దీంతో ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.&nbsp; రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మహేష్‌, రవితేజ, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌పోతినేని వంటి స్టార్ హీరోలతో జత కట్టిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిగా ఓ వెలుగు వెలుగింది.&nbsp; గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో రకుల్‌ సింగ్‌ తర్జనభర్జన అవుతోంది. దీంతో యంగ్‌ హీరోలతోనూ సినిమా చేసేందుకు వెనకాడటం లేదు. 2021లో వచ్చిన కొండ పొలం సినిమాలో యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ సరసన రకూల్ నటించింది.&nbsp; కొండ పొలం సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించి రకూల్‌ మెప్పించింది. తెలివిగల గిరిజన యువతి పాత్రలో ఒదిగిపోయింది. వైష్ణవ్‌ - రకూల్‌ జంటకు కూడా మంచి మార్కులే పడ్డాయి.&nbsp; తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో కుర్ర హీరోలతో సైతం నటించేందుకు ఈ బ్యూటీ సై అంటోంది.&nbsp; 2021లో వచ్చిన ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా తమన్నా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడినప్పటికీ వారి జంటకు మాత్రం మంచి పేరే వచ్చింది. కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది.&nbsp; కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రానికి రీమేక్‌గా ‘గుర్తుందా శీతాకాలం ’ సినిమా తీశారు. డైరెక్టర్‌ నాగశేఖర్‌ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.&nbsp;
  మే 24 , 2023
  Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
  Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
  విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న విజువల్స్‌ ట్రీట్‌ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క ట్రైలర్‌తోనే ఈ సినిమా టాలీవుడ్‌ అటెంషన్‌ మెుత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఇదిలా ఉంటే గామి ట్రైలర్‌లో చూపించిన ఓ సింబల్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సింబల్‌కు, కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. ఇంతకి ఆ సింబల్‌ ఏంటి? దానిపై నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం. అసలేంటి ఆ సింబల్‌? గామి ట్రైలర్‌ను గమనిస్తే మూడు ఆకులు ఒకదానికొకటి లింకప్‌ అయ్యి ఉన్న సింబల్‌ చాలా చోట్ల కనిపించింది. ట్రైలర్‌లో మానవ ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతంలో ఈ సింబల్‌ను ప్రధానంగా చూడవచ్చు. అక్కడ బందీలుగా ఉన్న వ్యక్తుల శరీరాలపై కూడా ఇదే సింబల్‌ ముద్రించి ఉండటం గమనార్హం. తల వెనక భాగంలో మెడ కింద ఈ సింబల్‌ను మీరు చూడవచ్చు. మరోవైపు విశ్వక్‌ సేన్‌ కూడా హిమాలయ యాత్రకు బయలుదేరినప్పుడు మంచులో ఈ సింబల్‌ను రాసి దాని ముందు పెద్దగా అరవడం ట్రైలర్‌లో చూడవచ్చు. అంటే హ్యూమన్‌ ట్రైల్స్‌కు, అఘోర శంకర్‌ (విష్వక్‌ సేన్‌)కు ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆ తరహా సింబల్‌ను వాడుక భాషలో ‘ట్రైక్యూట్రా’ అంటారు. అటువంటి ఈ సింబల్‌కు తీసుకొని డైరెక్టర్‌ విద్యాధర్‌.. కథలో ఎలాంటి నిర్వచనం చెప్తారో చూడాలి.&nbsp; భూత- భవిష్యత్‌- వర్తమాన కాలంలో కథ సాగుతుందా? ‘గామి’ ట్రైలర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తే ఈ సినిమా.. భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుందని అనిపిస్తోంది. ట్రైలర్‌లో.. 'వాళ్ల గాయాలకు నువ్వు బాధలు మోస్తున్నావ్‌' అంటూ ఓ అఘోరా అనడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ మానవ ప్రయోగాలకు హీరో శంకర్‌కు కచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. శంకర్‌ గతంలో ఆ హ్యూమన్‌ ట్రైల్స్‌లో బాధితుడి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ చెర నుంచి తప్పించుకొని ఆ ప్రయోగాల తాలుకూ స్పర్శ సమస్య ఎదుర్కొంటూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీని బట్టి కథ శంకర్‌ బాల్యంలో జరిగిన మానవ ప్రయోగాలు.. తన సమస్య పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేస్తున్న హిమాలయ యాత్ర చూపిస్తూ పార్లర్‌గా కథ సాగవచ్చని అంచనా.&nbsp; దేవదాసితో శంకర్‌కు ఉన్న సంబంధం? అఘోరా శంకర్‌కు.. దేవదాసికి మధ్య గల సంబంధంపై ట్రైలర్‌లో ఎలాంటి క్లూస్‌ డైరెక్టర్‌ ఇవ్వలేదు. రెండు పాత్రలను విభిన్న పరిస్థితుల్లో చూపించారు. దేవదాసి బిడ్డను కనడం.. ఆమెను ఊరివారు తరిమేయడం.. ఊరికి అరిష్టమని తెలిసి తిరిగి ఆమె కోసం వెతకడం వంటి దృశ్యాలు ట్రైలర్‌లో కనిపించాయి. ఒకవేళ దేవదాసి కూతురికి హీరోయిన్‌ చాందిని పాత్రకు సంబంధం ఉండే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాందిని పాత్ర అఘోర శంకర్‌కు సాయం చేయడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మార్చి 8 వరకూ ఆగాల్సిందే.&nbsp; గామి టీమ్‌పై రాజమౌళి ప్రశంసలు ఇక ‘గామి’ ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మూవీ టీమ్‌ కృషిని అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్‌ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
  మార్చి 06 , 2024

  @2021 KTree