థాయిలాండ్ యూట్యూబర్, ఫుడ్ బ్లాగర్ అయిన మార్క్ వీన్స్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో మార్క్ బెంగళూరులోని ఒక రెస్టారెంట్లో దక్షిణ భారత వంటకాలను తినడం చూడవచ్చు. అతను మామిడికాయ పచ్చడి, అవియల్, రసం, సాంబార్, పూరి అన్నం మరియు మరెన్నో 18 రకాల దక్షిణ భారతీయ వంటకాలను అరటి ఆకులో తింటూ రుచి చూస్తున్నాడు. కాగా, మార్క్‌కి సౌత్ దక్షిణాది వంటకాలంటే చాలా ఇష్టం. దీంతో ఇక్కడి వంటకాలను తింటూ పూర్తిగా ఆస్వాదించాడు. అవి అన్నీ రుచి చూసిన తర్వాత అతని అమూల్యమైన స్పందన వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియోను 7 లక్షలకు పైగా వీక్షించారు.