పిల్లల్ని కంటే రూ. 3 లక్షలు ఇస్తామని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. జననాల రేటు పెంచేందుకు అక్కడి సర్కారు చర్యలు చేపట్టింది. యువత జనాభా తగ్గుతుండటంతో దంపతులకు ఆఫర్ను ప్రకటించింది. అంతకముందు అక్కడ రూ. 2.50 లక్షలు ఇచ్చేవారు. వీటిని ఇప్పుడు రూ. 3 లక్షలకు పెంచారు. కానీ, జపాన్లో డెలివరీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో డెలివరీకి రూ. 2.60 లక్షలు ఖర్చు అవుతుంది. గతేడాది జననాల సంఖ్య 8,11,604 ఉండగా…మరణాల సంఖ్య 14 లక్షలపైనే ఉంది.