ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు సమర్పణలో శ్రీధర్ సీపన తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. సుధీర్, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో ‘మణిముత్యం’ అనే పాత్రలో తనికెళ్ళ భరణి, సీనియర్ హీరోయిన్ ఆమని ‘హాసిని’గా కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది.