సినీ నటుడు ఆలీ కుమార్తె వివాహం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన అతిరథ మహారథులందరికీ ఆలీ కృతజ్ఞతలు తెలిపారు. ‘ముస్లిం సంప్రదాయం ప్రకారం నా కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు వచ్చి.. తన కుమార్తె, అల్లుడిని ఆశీర్వదించిన అతిరథ మహారథులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి నాతో పనిచేసిన వారితో పాటు సినీ దిగ్గజాలు 200మంది వరకు వచ్చారు’ అని ఆలీ తెలిపారు. కాగా, చిరంజీవి, నాగార్జున దంపతులు; విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.