అప్పుడే ఓటీటీలో వ‌చ్చేస్తున్న ‘థ్యాంక్యూ’

నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ‘థ్యాంక్యూ’ మూవీ జులై 22న థియేట‌ర్లలో విడుద‌లైంది. బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. ఆగ‌స్ట్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కేవ‌లం మూడు వారాల‌ వ్య‌వ‌ధిలోనే సినిమా ఓటీటీలోకి రావడం గ‌మ‌నార్హం. రాశిఖ‌న్నా ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. అవికా గోర్, మాళ‌వికా నాయ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Exit mobile version