నాగచైతన్య, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ‘థ్యాంక్యూ’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. సినిమాను జులై 8న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం నేడు ప్రకటించింది. ఈ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించాడు. అవికా గోర్, మాళవికా నాయర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించాడు. తమన్ మ్యూజిక్ ఇచ్చాడు.