స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా సందడి చేసింది. కొత్త సంవత్సరం వేళ ట్విటర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అందులో సామ్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. ఓ నెటిజన్ “ నా గురించి అస్సలు తెలియని ఓ అమ్మాయి కోసం ఇక్కడ రోజు ప్రార్థిస్తున్నాను. అది ఎవరో కాదు మీరు” అంటూ ట్వీట్ చేయగా… “ ఆ అమ్మాయికి నువ్వు కావాలి” అని రిప్లై ఇచ్చింది. దీంతో సామ్ టచ్ చేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.